Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Clerk Jobs Exam Procedure and Preparation ‌Plan ‌





IBPS Clerk Jobs Exam Procedure and Preparation ‌Plan
IBPS Clerk Jobs  పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ ప్లాన్‌ ఇదే‌..!
లక్షల సంఖ్యలో పోటీపడే బ్యాంక్ క్లర్క్ కొలువు కొట్టడం ఎలా.. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి.., ఏయే సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి పూర్తి వివరాలతో ప్రిపరేషన్ ప్లాన్..
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) 1557 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 1000 పోస్టుల్ని కలిపింది. అంటే మొత్తం 2557 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో భారీగా ఖాళీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గెడైన్స్‌ వంటి అంశాలను తెలుసుకుందాం..

ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టులు: 2557
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్-85, తెలంగాణ-62.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్ క్రీమిలేయర్)లకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 23, 2020
దరఖాస్తు ఫీజు: రూ.850; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.175
పిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం: నవంబరు 18, 2020
ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్: డిసెంబరు 5, 12, 13 తేదీలు
ఫలితాల వెల్లడి: డిసెంబరు 31, 2020
మెయిన్ హాల్ టిక్కెట్ల జారీ: జనవరి 12, 2021
మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి 24, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/ or  DIRECT LINK

ఎంపిక ప్రక్రియ:
ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష, ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష ఉంటాయి. ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రిలిమినరీ పరీక్షను మూడు రోజులపాటు నిర్వహించనుండగా.. మెయిన్ పరీక్ష మాత్రం ఒకే రోజులో ఉంటుంది.

పరీక్ష విధానం:
1. పిలిమినరీ పరీక్ష:
ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు- 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు- 35 మార్కులకు జరుగుతుంది. ప్రతి విభాగానికి కేటాయించిన సమయం 20 నిమిషాలు. అంటే.. మొత్తంగా ప్రిలిమ్స్ పరీక్ష 100 ప్రశ్నలు-100 మార్కులకు గంట వ్యవధిలో నిర్వహిస్తారు.

నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. అభ్యర్థి ప్రతి విభాగంలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐబీపీఎస్ నిర్దేశించిన కటాఫ్ స్కోర్ దాటిన అభ్యర్థులను మాత్రమే ఖాళీలకు అనుగుణంగా షార్ట్‌లిస్ట్ చేసి మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.

2. మెయిన్ పరీక్ష:
మెయిన్ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు 35 నిమిషాల వ్యవధి; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు 35 నిమిషాల వ్యవధి;రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు 45 నిమిషాల వ్యవధి; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు 45 నిమిషాల వ్యవధిలో.. అంటే మొత్తంగా మెయిన్ పరీక్ష 190 ప్రశ్నలు-200 మార్కులకు 160 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

పిపరేషన్ విధానం:
క్లర్కు పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లను స్కోరింగ్ సెక్షన్లుగా పరిగణించాలి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల కోసం ప్రాక్టీస్‌తోపాటు న్యూస్ పేపర్లు, జర్నల్స్, మ్యాగజీన్‌లను చదవాలి. కరెంట్ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 

1. రీజనింగ్ ఎబిలిటీ:
బ్యాంక్‌ పరీక్షలో ఇది కీలక విభాగం. అభ్యర్థులు దీన్ని క్రమపద్ధతిలో ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ పరంగా లాజికల్ రీజనింగ్‌తో పోల్చితే అనలిటికల్ రీజనింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాక్టీస్‌తోపాటు సరైన స్పీడ్‌తో చేయగలిగినప్పుడే రీజనింగ్ ప్రశ్నలను సాధించగలం. కాబట్టి రోజూ నిర్దిష్ట సమయాన్ని రీజనింగ్ ప్రాక్టీస్ కోసం కేటాయించాలి. అలాగే మాక్ టెస్టులకు హాజరవ్వడం, బ్యాంకు పరీక్షల్లో అడిగిన గత ప్రశ్నలను సాధించడం చేయాలి.

ముఖ్యమైన టాపిక్స్‌:
పాబ్లమ్ సాల్వింగ్
బ్లడ్ రిలేషన్స్
కోడింగ్ అండ్ డీకోడింగ్
లెటర్ అండ్ సింబల్ సిరీస్
సిలాజిమ్స్
డెరైక్షన్స్

2. జనరల్ అవేర్‌నెస్:
బ్యాంకు పరీక్షల్లోనే అత్యధిక స్కోరింగ్ విభాగం ఇది. ఇతర సెక్షన్లతో పోల్చితే సులభంగానూ ఉంటుంది. ఇందులో అధిక మార్కులు సాధించాలంటే మాత్రం అంతర్జాతీయ, జాతీయ సమకాలీన అంశాలపై పట్టు సాధించడం తప్పనిసరి. దీనికోసం న్యూస్ పేపర్లు, టెలివిజన్ ఛానెళ్లు, సోషల్ మీడియాను అనుసరించాలి. భారత్‌కు సంబంధించిన కరెంట్ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ విభాగాలకు సంబంధించిన వార్తలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 

ముఖ్యమైన టాపిక్స్‌:
ఇండియన్ ఎకానమీ
ఫైనాన్స్
ప్రిన్స్‌పుల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్
కరెంట్ అఫైర్స్
బ్యాంకింగ్ పదాలు, నిర్వచనాలు
మార్కెటింగ్

3. ఇంగ్లిష్ లాంగ్వేజ్:
ఇంగ్లిష్‌పై ప్రాథమిక పట్టుతో ఈ విభాగంలో రాణించవచ్చు. అభ్యర్థులు సెంటెన్స్ అరేంజ్‌మెంట్స్, వర్డ్స్ రీ అరేంజ్‌మెంట్ ఇన్ సెంటెన్సెస్ తదితర నైపుణ్యాలతో ఈ విభాగంలో మంచి మార్కులు పొందవచ్చు. అలాగే గ్రామర్ నైపుణ్యాలు తప్పనిసరి. ప్రాక్టీస్ ద్వారా గ్రామర్‌పై పట్టు సాధించొచ్చు. క్రమం తప్పకుండా రాయడం, చదవడం చేస్తే ఇంగ్లిష్‌పై ప్రాథమిక అవగాహన లభిస్తుంది.

ముఖ్యమైన టాపిక్స్‌:
వొకాబ్యులరీ
సినానిమ్స్
ఆంటోనిమ్స్
స్పెల్లింగ్స్
వర్డ్ ఫార్మేషన్
గ్రామర్
టెన్సెస్ రూల్స్

4. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగం అభ్యర్థి న్యూమరికల్ సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. వాస్తవ పరిస్థితులకు సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రశ్నలు ఇందులో అడుగుతారు. క్యాల్కులేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. క్రమంతప్పకుండా ఆన్‌లైన్ క్విజ్‌లకు హాజరవ్వడం ద్వారా ఈ విభాగానికి అవసరమైన సన్నద్ధత లభిస్తుంది. 

ముఖ్యమైన టాపిక్స్‌:
రేషియో అండ్ ప్రపోర్షన్
డేటా ఇంటర్‌ప్రిటేషన్
పర్సంటేజెస్
యావరేజెస్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్
  
5. కంప్యూటర్ నాలెడ్జ్:
సిలబస్ పరంగా ఇది స్కోరింగ్ విభాగం. అభ్యర్థులు కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానంతో ఈ సెక్షన్‌లో మంచి స్కోరు సాధించొచ్చు.

ముఖ్యమైన టాపిక్స్:
కంప్యూటర్ బేసిక్స్
నెట్‌వర్క్ బేసిక్స్
ఎంఎస్ వర్డ్
ఎంఎస్ ఎక్సెల్‌జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్
ఇంటర్నెట్.

Previous
Next Post »
0 Komentar

Google Tags