Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

If the admission is cancelled, the fee has to be refunded - AICTE



If the admission is cancelled, the fee has to be refunded - AICTE directive for technical education institutions
అడ్మిషన్ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే - సాంకేతిక విద్యా సంస్థలకు ఏఐసీటీఈ ఆదేశం
 ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశం పొంది వివిధ కారణాలతో అడ్మిషనను రద్దు చేసుకునే విద్యార్థులకు ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిలభారత  సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ అడ్మిషన్ రద్దు చేసుకునే విద్యార్థులతోపాటు మధ్యలో ఉపసంహరించుకునే విద్యార్థులకు కూడా ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని అన్ని సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు సూచనలు ఇచ్చింది. కోవిడ్ 19లో తత్తిన అత్యవసర పరిస్థితి నేపథ్యం లో ఇది ప్రతి విద్యా సంస్థ ప్రాథమిక బాధ్యతగా గుర్తెరగాలని పేర్కొంది. పూర్తి ఫీజు వాపసుతో సాంకేతిక కోర్సుల సీట్ల ఆడిషను రద్దు చేసుకోవడానికి గడువు నవంబర్ 10 ఏఎసీటీఈ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసింది. మరికొన్ని అంశాలని జోడిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ఇలా –
* నవంబర్ 10 కంటే విద్యార్ధి ముందుగా ఉపసంహరించుకుంటే Rs. 1000 లోపు ప్రొసెసింగ్ చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని విద్యా సంస్థలు తిరిగి చెల్లించాలి.
* ఒకవేళ నవంబర్ 10 తర్వాత విద్యార్థి అడ్మిషనన్ను వదిలేస్తే.. ఖాళీ అయ్యే ఆ సీటును నవంబర్ 15లోగా వేరే విద్యార్థితో భర్తీ చేసుకుంటే రూ.1,0008 మించకుండా ప్రాసెసింగ్ ఛార్జీలు తీసుకోవచ్చు. దీంతోపాటు విద్యార్థి ఎన్ని రోజులపాటు ఉన్నాడో ఆ మేరకు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు (హాస్టల్ ఉంటేనే)ను మినహాయించుకుని తక్కిన
మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలి.. * నవంబర్ 10 తర్వాత ఖాళీగా ఉన్న సీటు నవంబర్ 15 వరకు భర్తీ కాకపోతే ఆ విద్యా సంస్థ సదరు విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి చెల్లించాలి. సర్టిఫికెట్లు కూడా వెనక్కి ఇవ్వాలి.
* విద్యార్థి అడ్మిషను వదులుకుని సంస్థ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తదుపరి సెమిస్టర్లు, సంవత్సరాలకు సంబంధించిన ఫీజును అడగరాదు.
* ప్రవేశాన్ని రద్దు చేయడం లేదా పీజును వాపసు చేయడులో ఆలస్యం, ఏఐసీటీఈ మార్గదర్శ కాలను పాటించకున్నా చర్యలు తప్పవు.

Previous
Next Post »
0 Komentar

Google Tags