If no standards, notices to colleges - Straight
into Ph.D with 4-year degree: CM
ప్రమాణాలు లేకపోతే కాలేజీలకు నోటీసులు - నాలుగేళ్ల డిగ్రీ తో నేరుగా పిహెచ్‌డి లోకి: సిఎం
రాష్ట్రంలోని అన్ని కళాశాలలు
మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా
నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎబీఏ), నేషనల్ అక్రిడిటేషన్
కౌన్సిల్ (ఎస్ఎసీ) గుర్తింపు పొందాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ విద్యావిధానంపై సీఎం జగన్
అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కళాశాలలు కూడా ఆ ప్రమాణాలు సాధించాలని.. కళాశాలల్లో ప్రమాణాలపై ఎన్‌వోపీలు
ఖరారు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అన్ని కళాశాలల్లో తరచూ తనిఖీలు చేయాలని
జగన్ ఆదేశించారు. ఈ తనిఖీలకు 30 మందితో 10
బృందాలు ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా టీచర్ ట్రైనింగ్ కళాశాలలపై దృష్టి పెట్టాలని
ఆదేశించారు. కళాశాలల్లో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలని... అప్పటికీ మార్పు
రాకపోతే ఆ కళాశాలలను మూసివేయాలని స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో అధునాతన అంశాలతో
కోర్సులు రూపొందించాలని చెప్పారు. ఇక నుంచి ఏడాది లేక రెండేళ్ల పీజీ... మూడు లేక
నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉండాలని సూచించారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్
డీలో నేరుగా ప్రవేశానికి అర్హత కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటానమస్
కళాశాలల సంఖ్య పెరగాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు
సూచించారు.
0 Komentar