IIIT Admission Notification soon - RGUKT Chancellor
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు త్వరలో నోటిఫికేషన్
- ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కె.చెంచురెడ్డి
మూడు, నాలుగు
రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీలకు 2020-21 విద్యా
సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ కానుంది. ఆర్జీయూకేటీ ఛాన్సలర్
కె.చెంచురెడ్డి మంగళవారం ఈ విషయం తెలిపారు.
ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ గెస్టహౌస్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల
ఇంటర్వ్యూల తీరును పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్
ఐటీలలో అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన ఇంకా
ఏమన్నారంటే...
- తెలంగాణలోని బాసర
ట్రిపుల్ ఐటీలో నాన్ లోకల్ కింద ఏపీకి రావాల్సిన 225 సీట్లు
నష్టపోకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం.
- ఇంజినీరింగ్ చివరి, ఇంటర్
రెండవ సంవత్సరం విద్యార్థులకు కూడా త్వరలో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు
ఇస్తాం.
- విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం
ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోనే ఉంటుంది. విజయవాడ లేదా విశాఖకు తరలిస్తారన్న వదంతులను
నమ్మవద్దు. విద్యాలయానికి రెగ్యులర్ వైస్ చాన్స్ లర్, డైరెక్టర్
లను నియమిస్తాము.
0 Komentar