India Allows Five States To Borrow More
As They’ve Met ‘One Nation, One Ration Card’ Condition
ఐదు రాష్ట్రాలు ‘వన్ నేషన్, వన్
రేషన్ కార్డ్’ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు ఎక్కువ రుణాలు తీసుకోవడానికి
భారతదేశం అనుమతిస్తుంది
కేంద్ర ప్రభుత్వం అప్పులకు
అనుమతించిన రాష్ట్రాల్లో తెలంగాణతో ఏపీ, కర్ణాటక, గోవా, త్రిపుర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ‘ఒకే దేశం..
ఒకే రేషన్ కార్డు’ (వన్ నేషన్-వన్ రేషన్ కార్డు) పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన
ఐదు రాష్ట్రాలకు కేంద్రం అనుమతించింది.
తెలంగాణ అప్పులు చేసుకొనేందుకు
కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రూ.2,508 కోట్లు మాత్రమే
చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, తాము ప్రకటించిన
పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని, ఆపై అప్పులు చేసుకోవచ్చని
పేర్కొంది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ (వన్ నేషన్-వన్ రేషన్ కార్డు) పథకాన్ని
విజయవంతంగా అమలు చేసిన ఐదు రాష్ట్రాలకు.. ఓపెన్ మార్కెట్ రుణాల (ఆఫీస్ ఆన్
మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్-ఓఎంబీ) రూపంలో మొత్తం రూ. 9,913 కోట్ల మేర అప్పులు చేసుకునేలా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులు
మంజూరు చేసింది.
కేంద్ర ప్రభుత్వం అప్పులకు
అనుమతించిన రాష్ట్రాల్లో తెలంగాణతో ఏపీ, కర్ణాటక, గోవా, త్రిపుర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వీటిలో
తెలంగాణకు రూ.2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్
రూ.2,525 కోట్లు, కర్ణాటక రూ.4,509 కోట్లు, గోవా రూ.223 కోట్లు,
త్రిపుర రూ.148 కోట్లు అప్పులు చేసుకొనేందుకు
అనుమతించారు.
2020-21 సంవత్సరానికి
గాను.. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో రాష్ట్రాలకు అదనపు రుణపరిమితిని
పెంచుతూ ఈ ఏడాది మే నెలలో కేంద్రం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీని
ప్రకారం రాష్ట్రాలకు రూ.4,27,302 కోట్ల మేర అదనంగా రుణాలు
తీసుకోవచ్చు. ఇందులో ఒక శాతాన్ని నాలుగు నిర్దిష్టమైన రాష్ట్ర స్థాయి సంస్కరణలను
బట్టి అనుమతిస్తామని కేంద్రం వెల్లడించింది. వాటిలోనే ‘వన్ నేషన్.. వన్ రేషన్
కార్డు’, సులభతర వ్యాపార సంస్కరణలు వంటివి ఉన్నాయి.
0 Komentar