Inter exams from March 24 - New academic
year from June 1
TS: మార్చి 24 నుంచి ఇంటర్ పరీక్షలు - జూన్ 1 నుంచి నూతన విద్యాసంవత్సరం
తెలంగాణ 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్
బోర్డు విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 182 పనిదినాలను లెక్కించారు. కొవిడ్ నేపథ్యంలో 2020-21
విద్యా సంవత్సరంలో 228 నుంచి గరిష్ఠంగా 46 పనిదినాలు తగ్గించారు.
దసరా సెలవులు అక్టోబర్ 23
నుంచి 25 వరకు మూడ్రోజులు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు
వచ్చే ఏడాది జనవరి 13, 14 తేదీలుగా ప్రకటించారు. ప్రభుత్వం
ప్రకటించే సెలవు దినాలకు అనుగుణంగా క్యాలెండర్‌లో స్వల్ప మార్పులుంటాయని ఇంటర్‌బోర్డు
పేర్కొన్నది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అన్ని జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు
చేపట్టాలని సూచించింది.
ప్రైవేటు కాలేజీల్లో పీఆర్వో
వ్యవస్థను నిషేధిస్తున్నట్టు తెలిపింది. తమ కళాశాలలో చేరాలని ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగ్‌లు
ఏర్పాటు చేయడం, కరపత్రాలు, వాల్‌రైటింగ్స్‌ను
నిషేధించినట్టు వెల్లడించింది. అర్హులైన లెక్చరర్లను స్పాట్ వాల్యూయేషన్‌కు పంపని
వారిపైనా చర్యలుంటాయని స్పష్టం చేసింది.
2020-21 క్యాలెండర్:
మొత్తం పనిదినాలు: 182
తరగతులు ప్రారంభ తేదీ:
సెప్టెంబర్ 1, 2020
కాలేజీలకు చివరి పని రోజు:
ఏప్రిల్ 16, 2021
ప్రీ ఫైనల్ పరీక్షలు:
ఫిబ్రవరి 22 నుంచి 27, 2021
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు:
మార్చి 1 నుంచి 20, 2021
ఇంటర్ థియరీ పరీక్షలు:
మార్చి 24 నుంచి ఏప్రిల్ 12, 2021
వేసవి సెలవులు:
ఏప్రిల్ 17 నుంచి మే 31, 2021
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ:
మే చివరి వారం, 2021
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం:
జూన్ 1, 2021
0 Komentar