Inter faculty rationalization
ఇంటర్ అధ్యాపకుల హేతుబద్ధీకరణ
జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల
సంఖ్యకనుగుణంగా అధ్యాపకుల హేతుబద్ధీకరణ ప్రక్రియను బదిలీల తర్వాత ప్రభుత్వం
చేపట్టనుంది. మూడేళ్లుగా ఉర్దూ మాధ్యమం, వృత్తి విద్య కోర్సుల్లో 20 మంది, సైన్సు, ఆర్ట్స్
గ్రూపుల్లో 30 మందిలోపు విద్యార్థులున్న కళాశాలల్లో ఆయా కోర్సులు
కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తొలుత 20 మంది
విద్యార్థుల కంటే తక్కువ ఉన్న గ్రూపు లను మూసి వేస్తారు. ఇప్పటికే పలు జిల్లాల్లో
ఈ కసరత్తు చేసి కమిషనరేట్ కు వివరాలను పంపించారు.
మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ
ఎయిడెడ్ కళాశాలల్లో కొన్ని గ్రూపుల్లో 5-15 మంది మాత్రమే చేరారు. రెండో ఏడాది
విద్యార్థులను అక్కడే కొనసాగించ డమా లేదా సమీపంలోని కళాశాలల్లో చేర్పించడమా? అన్నది
తేలాల్సి ఉంది. ఇంటర్ విద్యా మండలి గణాం కాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,
ప్రైవేటు, అన్ని యాజమాన్యాలు కలిపి 3,218 కళాశాలలుండగా 5.28,863 మంది విద్యార్థులు
చదువుతున్నారు. ప్రైవేటు లోని 1,750 కళాశాలల్లో 3,70,901 మంది చదువుతుం డగా.. ప్రభుత్వంలోని అన్ని
యాజమాన్యాల్లో కలిపి 1 58 లక్షలు మాత్రమే ఉన్నారు.
0 Komentar