JEE Main-2020 Results Released
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల, రిజల్ట్
లింక్ ఇదే..!
జేఈఈ 2020 మెయిన్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి.
ఐఐటీ, ఎన్‌ఐటీ,
ఐఐఎస్‌ఈఆర్ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం
నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2020
మెయిన్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. రెండో విడత జేఈఈ పరీక్షలు ఈ నెల 1 నుంచి 6 వరకు జరగిన సంగతి తెలిసిందే.
2020 జనవరిలో జరిగిన మొదటి
విడత మెయిన్ పరీక్షలకు బీఈ/బీటెక్‌లో చేరేందుకు పేపర్-1కు 9.26 లక్షలమంది హాజరుకాగా ఈసారి పేపర్-1, 2 లకు కలిపి 6.35 లక్షలమందే రాశారు. అయితే తాజా ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ http://ntaresults.nic.in/ , https://jeemain.nta.nic.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి: CHECK YOUR RESULTS HERE
27న జేఈఈ అడ్వాన్స్‌డ్:
మెయిన్స్ ఫలితాలక విడుదలయ్యాక
కటాఫ్ మార్కుల ఆధారంగా, 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్
పరీక్షకు అనుమతిస్తారు. ఈ పరీక్ష ఈనెల 27న దేశవ్యాప్తంగా
జరుగనుంది. దరఖాస్తుకు నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
24 మందిలో మనోళ్లు 11
మంది.
21 మందికి 100 పర్సంటైల్
సాధించగా వారిలో 11 మంది తెలుగు విద్యార్థులే.
అందులో తెలంగాణకు చెందిన ఎనిమిది
మంది,
ఏపీ విద్యార్థులు ముగ్గురు ఉన్నారు.. తెలంగాణ నుంచి 1. చాగరి కౌశల్ కుమార్ రెడ్డి 2. చుక్కా తనూజ 3..
దీప్తి యశశ్చంద్ర 4. ఎం.లిఖిత్ రెడ్డి 5.రాచపల్లి శశాంక్ అనిరుధ్ 6. ఆర్.అరుణ్ సిద్ధార్డ్
". సాగి శివకృష్ణ 8. వాడపల్లి అర్వింద్ నరసింహా.
ఏపీ విద్యార్థులు 1. లండా జితేంద్ర 2. తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ 3.
వైఎస్ఎస్ నరసింహనాయుడు.
0 Komentar