JNTUH: Slight changes in the timetable
of Engineering and B.Pharmacy exams
ఇంజనీరింగ్, బీఫార్మసీ
పరీక్షల టైంటేబుల్లో స్వల్ప మార్పులు.. వివరాలు ఇవే..!
జేఎన్‌టీయూ-హైదరాబాద్ ప్రకటించిన
బీటెక్,
బీ ఫార్మసీ పరీక్షల టైంటేబుల్లో స్వల్ప మార్పులు చోటు
చేసుకున్నాయి. పరిస్థితుల కారణంగా ఆదివారం సైతం పరీక్షలు నిర్వహించాలని
నిర్ణయించింది. తొలుత సెప్టెంబరు 16 నుంచి 25 వరకు చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన విషయం
తెలిసిందే.
కాగా సెప్టెంబరు 21న
జరగాల్సిన బీటెక్, బీఫార్మసీ పరీక్షలు 20వ తేదీన, 23న జరగాల్సినవి 27న
నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 21కు బదులుగా 20వ తేదీన, 23న
జరగాల్సినవి 27న ఉంటాయని ప్రకటించింది. మారిన షెడ్యూల్
వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పరీక్షల విభాగం సంచాలకుడు
వి.కామాక్షిప్రసాద్ ఒక ప్రకటనబీటెక్, బీ ఫార్మసీలో ఆర్09,
ఆర్13, ఆర్15, ఆర్16
సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్
పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు.
0 Komentar