Job along with BTech degree in Indian
Navy .. Inter qualification .. Apply ..!
ఇండియన్ నేవీలో బీటెక్ డిగ్రీతో
పాటు ఉద్యోగం.. ఇంటర్ అర్హత.. దరఖాస్తు చేసుకోండి..!
భారత నౌకా దళం క్యాడెట్ ఎంట్రీ
స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల బీటెక్ (10+2) కోర్సులో ప్రవేశాలకు
నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమళ (కేరళ) నేవల్ అకాడమీ అవివాహిత
పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. భారత
నౌకా దళం క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్ల బీటెక్ (10+2) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రాసిన
అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు బీటెక్
డిగ్రీతోపాటు ఉద్యోగం కల్పిస్తారు.
దరఖాస్తులు అక్టోబర్ 6న
ప్రారంభమవుతాయి. ఎంపికైన అభ్యర్థులను కోర్సు పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్,
ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలకు
పంపిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/
వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 34
ఎడ్యుకేషన్ బ్రాంచీ- 5
ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్
బ్రాంచీ- 29
ముఖ్య సమాచారం:
అర్హత: 70శాతం
మార్కులతో ఇంటర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు.. జేఈఈ మెయిన్-2020కు హాజరై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 02
జులై 2001 నుంచి 01 జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా
ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 06, 2020
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20, 2020
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
I have eye sight problem can I eligible for this sir
ReplyDelete