KCR gave assurance to Revenue employee’s
safety
రెవెన్యూ ఉద్యోగుల భద్రతకు ఢోకా లేదు:
KCR
హైదరాబాద్: ప్రజలకు మేలు చేసేందుకే
కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం
చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వీఆర్వో
వ్యవస్థ రద్దు బిల్లులు సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
రెవెన్యూశాఖలో ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ధోకా లేదని హామీ ఇచ్చారు. రెవెన్యూ
సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయని, ఉద్యోగులకు
ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. వీఆర్వోలు ఆందోళన చెందవద్దని వారిని స్కేల్
ఉద్యోగులుగా గుర్తిస్తామ తెలిపారు. స్థాయికి తగినట్టు వీఏవోలకు వివిధశాఖల్లో
ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయేతర
విభాగాలుగా ధరణి పోర్టల్ ఉంటుందన్నారు. ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని
వివరించారు. "రెవెన్యూ అధికారుల పై గతంలో అనేక దాడులు జరిగాయి. పీవీ, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్
హయాంలో కొన్ని మార్పులు జరిగాయి. అయినా, గత పాలకులు రెవెన్యూ
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదు . రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లుగా
కృషి చేస్తున్నాం. ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకే మా ప్రయత్నం "
అని సీఎం వివరించారు . త్వరలో డిజిటిల్ మ్యా న్లు .... "త్వరలో డిజిటల్
మ్యాప్ తయారు చేస్తాం. అది కూడా కంప్యూటర్ లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది ,
తెలంగాణలో భూముల విలువ పెరిగింది. భవిష్యత్ లో శాంతిభద్రతల సమస్యలు
తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వంపై భారం పడినా రెవెన్యూ సంస్కరణలు చేపట్టాం.
నూతన చట్టం ద్వారా అవినీతి మాయమవుతుంది. భూ మాఫియా నుంచి పేద ప్రజలకు ఈ రెవెన్యూ
చట్టం రక్షణ కవచంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం అంగుళం భూమి కూడా ఇతరులు
అక్రమించలేరు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ టెక్నాలజీ విధానంలో రికార్డులు భద్రంగా
ఉంటాయి. ధరణి పోర్టల్ నుంచి ఎవరైనా వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రయ విక్రయాల
రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పోర్టల్ లో అప్డేట్ అవుతాయి. ఎవరు ఎక్కడున్నా ..
ఉన్నచోట నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చు . గ్రామకంఠం, పట్టణ
భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తాం. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర
భూముల రిజిస్టేషన్లు, తహసీల్దార్లకు వ్వవసాయ భూములు
రిజిస్ట్రేషన్ చేసే అధికారం. ఇక నుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్టార్లు. ఏమైనా
సమస్యలుంటే న్యాయ విభాగం కోర్టులు పరిష్కరిస్తాయి. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు
ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంది.
కొత్త చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం. కొత్త చట్టంతో 99.99 శాతం ఆస్తుల తగాదాలు ఉండవు. భూ వివాదాలపై తహసీల్దార్, ఆర్డీవో, జేసీలు ఆర్డర్ ఇస్తారు. వీఆర్ఏలలో 30
శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే
ఉన్నారు. వారికి స్కేల్ పోస్టులు ఇస్తాం. అనివార్య కారణాల వల్ల వీఆర్వో వ్యవస్థ
రద్దు చేస్తున్నాం" అని సీఎం కేసిఆర్ తెలిపారు.
0 Komentar