KGBV Admissions List released for 6,
7 and 8th classes
కేజీబీవీల్లో ప్రవేశాలకు జాబితా
విడుదల
రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో
నడుస్తున్న 852 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2020-21
విద్యాసంవత్సరాని కిగానూ 6వ తరగతిలో ప్రవేశం
కోసం, 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం మూడో విడత
జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి
సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థినులు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5వ తేదీలోపు వారి ఫోన్లకు పంపిన
సమాచారం ప్రకారం తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు
రిపోర్టు చేయాలని వివరించారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099,
9494383617 నంబర్లను సంప్రదించాలన్నారు.
0 Komentar