LEGRAND SCHOLARSHIP PROGRAM 2020-21 FOR
WOMEN
అమ్మాయిలకు స్కాలర్‌షిప్.. రాత
పరీక్షలు లేవు.. ఏడాదికి రూ.60 వేలు..!
అమ్మాయిలకు ప్రముఖ సంస్థ లెగ్రాండ్
గొప్ప అవకాశం కల్పిస్తోంది. మొత్తం ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్‌షిప్
రూపంలో అందిస్తోంది.
ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్‌ల్లో
కోర్సుల్లో చేరాలనుకునే అమ్మాయిలకు ప్రముఖ సంస్థ లెగ్రాండ్ గొప్ప అవకాశం
కల్పిస్తోంది. మొత్తం ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్‌షిప్
రూపంలో అందిస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసుకున్న అమ్మాయిలు దరఖాస్తు
చేసుకోవచ్చు.
LEGRAND SCHOLARSHIP PROGRAM 2020-21 పేరుతో వీటిని అందిస్తున్నారు. అమ్మాయిల అకడమిక్ కలలను
నెరవేర్చుకోవడానికి అవసరమైన సాయాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
స్కాలర్‌షిప్ మొత్తం: అకడమిక్
ఫీజులో 60 శాతం లేదా రూ. 60,000 చెల్లిస్తారు. ఇది కోర్సు
చదివే నాలుగేళ్లపాటూ కొనసాగుతుంది.
అర్హతలు:
భారతీయ విద్యార్థినులై ఉండాలి.
ఈ ఏడాది ఇంటర్ పాసై ఉండాలి.
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో
కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
బీటెక్/ బీఈ/ ఆర్కిటెక్చర్
(బి.ఆర్క్) ప్రోగ్రాములు చదవాలనుకునే వారు.. ఏ స్పెషలైజేషన్ ఎంపిక చేసుకున్న
వారైనా దరఖాస్తుకు అర్హులు.
దేశంలో గుర్తింపు పొందిన
కాలేజీల్లో ప్రవేశం పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.5
లక్షలకు మించకూడదు.
విదేశాల్లో చదివే మన విద్యార్థులూ, మన
దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులూ దరఖాస్తుకు అనర్హులు.
0 Komentar