Lots of energy with Sesame Seeds (Til) and More Benefits
నువ్వులతో బోలెడంత ఎనర్జీ..
మరెన్నో ప్రయోజనాలు
నువ్వుల్లో ఉన్న ఈ ప్రయోజనాలు
గురించి తెలిస్తే.. ఈ రోజు నుంచే వాటిని మీ డైట్‌లో భాగం చేసుకుంటారు.
మనం నువ్వులను చాలా తక్కువగా
తీసుకుంటాం. నువ్వుల్లో శరీరానికి మాంచి ఎనర్జీని అందించే పోషకాలు ఉన్నాయనే సంగతి
తెలియక చాలామంది వీటిని పక్కన పెడతారు. అయితే, మన పూర్వికులకు ఇందులోని
పవర్ గురించి అవగాహన ఉంది. అందుకే.. చాలామంది నువ్వులను ఉండలుగా చేసుకుని
తినేవారు. పిండి వంటల్లో కూడా వాటిని వేసేశారు. నువ్వుల నూనెతో చేసే వంటలు
శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. మరి
నువ్వుల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా!
❂ నువ్వుల్లో ఇనుము శాతం అధికంగా ఉంటుంది.
❂ రక్త హీనత సమస్యలతో బాధపడేవారు నవ్వులను
ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది.
❂ నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా
అదుపు చేస్తాయి.
❂ నువ్వుల నూనెతో ముఖానికి మర్ధన చేసుకుని,
కాస్త శనగపిండితో నలుగు పెట్టుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది.
❂ నువ్వులు తింటే ఉబ్బసం వ్యాధి నుంచి ఉపశమనం
లభిస్తుంది.
❂ నీరసంగా బలహీనంగా ఉండేవారు సైతం నువ్వులు,
బెల్లం కలిపిన ఉండలు రోజూ తినడం మంచిది.
❂ నువ్వుల్లో అమినోయాసిడ్, మాంసకృత్తులు ఎక్కువ.
❂ నువ్వుల్లోని పోషకాలు రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడతాయి.
❂ నువ్వుల్లో ఉండే ‘సెసమాల్’ యాంటీ ఆక్సిడెంట్ గుండెను వ్యాధుల
నుంచి కాపాడుతుంది.
❂ నువ్వుల్లో ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపు చేస్తుంది.
❂ హైబీపీతో బాధపడేవారు నువ్వుల నూనెతో చేసే వంటకాలు తినడం
మంచిది.
0 Komentar