LPG Subsidy: Is your gas cylinder not subsidized?
LPG Subsidy: Is your gas cylinder not
subsidized?
మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? స్టేటస్
ఇలా చెక్ చేయండి
వెబ్‌సైట్ http://mylpg.in/
ఓపెన్ చేయండి. హోమ్
పేజీలోనే మీ 17 అంకెల ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయండి. ఎల్‌పీజీ
ఐడీ మీ ఎల్‌పీజీ పాస్ బుక్ పైన ఉంటుంది. ఒకవేళ మీ ఎల్‌పీజీ ఐడీ తెలియకపోతే click
here to know your LPG ID పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ
గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు సెలెక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ
ఎల్‌పీజీ ఐడీ తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఎల్‌పీజీ ఐడీని ఎంటర్ చేయండి. సబ్మిట్
చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో
రిజిస్టర్ చేసుకొండి. మీ ఇమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్
క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది.
ఈ వివరాలతో లాగిన్ చేస్తే మీ ఎల్‌పీజీ
అకౌంట్‌కు బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో
తెలుస్తుంది. అందులోనే మీ సబ్సిడీ ట్రాన్స్‌ఫర్ అయిందో లేదో స్టేటస్
తెలుసుకోవచ్చు.
You may also like these Posts
0 Komentar