Maintenance of vehicle documents,
e-challans through IT portal from Oct 1
వాహనదారుల చిట్టా - పత్రాలు, డ్రైవింగ్
లైసెన్సులు, ఇ-చలాన్ల నిర్వహణ ఇక పోర్టల్ లోకి
అక్టోబర్ 1
కొత్త నిబంధనలు అమల్లోకి
వచ్చేనెల ఒకటో తేదీ నాటి నుంచి
వాహనదారుల చిట్టాను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్ర రహ దారి, రవాణాశాఖ
రాష్ట్రాలను ఆదేశించింది. వాహనాల డాక్యుమెంట్లు, ఈ-చలానాలు
అన్నీ ఆన్లైన్లో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో
వీటిని పర్యవేక్షించడంవల్ల ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం సులభం అవుతుందని,
దీనివల్ల డ్రైవరులకు పోలీసులు, ఇతర రవాణా శాఖ
సిబ్బంది నుంచి అనవసరమైన వేధింపులు తగ్గుతాయని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్సుల
రద్దు, పునరుద్ధరణ లాంటి వివరాలను తేదీల ప్రకారం రవాణా
పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. దాని ఆధారంగా డ్రైవర్ల ప్రవర్తనను కూడా
పర్యవేక్షించాలని ఆదేశించింది. వాహన పత్రాలు ఎలక్రానిక్ విధానంలో అందుబాటులో ఉంటే
వాటిని తనిఖీ కోసం కాగితాలు
రూపంలో అడగాల్సిన అవసరం లేదని
అధికారులకు సూచించింది. ఏదైనా నేరం జరిగినప్పుడు వాహనాన్ని సీజ్ చేయడానిక్కూడా
అవేమీ అవసరం లేదని తెలిపింది. పోలీసులు కానీ, ఇతర రవాణా శాఖ అధికారులు
కానీ డాక్యుమెంట్లను తనిఖీ చేసినప్పుడు ఆ సమయం, తేదీ
వివరాలను తప్పనిసరిగా పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించింది. దీనివల్ల తనిఖీల
పేరుతో డ్రైవర్లను వేధించడం తప్పుతుందని తెలిపింది. అలాగే డ్రైవర్లకు అనువైన
కమ్యూనికేషన్ పరికరాలు ఇవ్వాలని, వాటిని కేవలం మార్గం (రూట్
నావిగేషన్ తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంది. దానివల్ల డ్రైవింగ్
చేసే సమయంలో డ్రైవర్ల దృష్టి మరలకుండా ఉంటుందని స్పష్టంచేసింది.
0 Komentar