ఎంబీబీఎస్: దేశవ్యాప్తంగా
82,926 ఎంబీబీఎస్ సీట్లు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజా
వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్
మెడికల్ కాలేజీల్లో 82,926 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
తెలంగాణలో 10
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,740 సీట్లు
22 ప్రైవేట్ కాలేజీల్లో 3,300 ఎంబీబీఎస్ సీట్లు
జాతీయ స్థాయి కౌన్సెలింగ్ తర్వాత
రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ
దేశవ్యాప్తంగా వైద్య విద్య
ప్రవేశాల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వారం రోజుల్లోగా నీట్ ఫలితాలు
వెలువడగానే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు మొదలుకానున్నాయి.
నీట్ అర్హత ద్వారానే అడ్మిషన్లు జరుగుతుండటంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు
జాతీయస్థాయిలో పేరొందిన కాలేజీల్లో సీట్లు వస్తాయి.
దేశంలోని అన్ని ప్రభుత్వ మెడికల్
కాలేజీలకు చెందిన 15 శాతం సీట్లు జాతీయ కౌన్సెలింగ్ ద్వారా
భర్తీ చేస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాల విద్యార్థులూ తమ ర్యాంకును బట్టి
ఇష్టమైన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశముంది. అందుకోసం ఆప్షన్లు ఉంటాయి.
మొత్తం సీట్లు 82
వేలు:
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
(ఎంసీఐ) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 541 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 82,926 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 278 ప్రభుత్వ
మెడికల్ కాలేజీల్లో 42,729 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇక 263 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 38,840
సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ సహా మరో 15 ఎయిమ్స్‌ల్లో 1,367 ఎంబీబీఎస్ సీట్లున్నాయి.
జాతీయ కోటాలో 6,410 సీట్లు:
అన్ని రాష్ట్రాల ప్రభుత్వ మెడికల్
కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ
చేస్తారు. ఆ ప్రకారం జాతీయంగా 6,410 ఎంబీబీఎస్ సీట్లను అఖిల
భారత కోటా కింద భర్తీ చేస్తారు. ఈ మేరకు జాతీయస్థాయి కౌన్సెలింగ్ జరగనుంది. ఆ
ప్రాతిపదికనే నీట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లలో తమకు
ఇష్టమైన మెడికల్ కాలేజీలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులకు
నీట్ ర్యాంకు ఆధారంగా కాలేజీలను కేటాయిస్తారు.
తెలంగాణలో 5,040 సీట్లు:
ఎంసీఐ లెక్క ప్రకారం రాష్ట్రంలోని 32
ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 5,040 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో 10 ప్రభుత్వ
మెడికల్ కాలేజీల్లో 1,740 ఎంబీబీఎస్ సీట్లుండగా.. 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3,300
సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లల్లో 15 శాతం అంటే 261 సీట్లను అఖిల భారత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన
సీట్లన్నింటినీ రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
ఇక బీబీనగర్ ఎయిమ్స్‌లో 50
ఎంబీబీఎస్ సీట్లున్నా వీటన్నింటినీ జాతీయ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు.
రాష్ట్ర విద్యార్థులు అఖిల భారత స్థాయిలో దాదాపు 8 వేల
సీట్లకు పోటీపడే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు
అంచనా వేస్తున్నాయి.
తొలుత జాతీయ కోటా కౌన్సెలింగ్:
అఖిల భారత కోటాలో మొదటి విడత
కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం.. రాష్ట్రంలో మొదటి విడత కౌన్సెలింగ్
నిర్వహిస్తారు. జాతీయ కోటా రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక, ఇక
మిగిలే సీట్లను ఆయా రాష్ట్రాలకే తిరిగి కేటాయిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో రెండో
విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన
సీట్లను మాప్ అప్ రౌండ్ పద్ధతి కౌన్సెలింగ్ ద్వారా అన్నింటినీ భర్తీ చేస్తారు.
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం
సీట్లనూ.. ప్రైవేటులోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో
రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.
0 Komentar