"Minute"
rule for EAMCET - Entrance test starts from tomorrow
ఎంసెట్ కు “నిమిషం' నిబంధన
- రేపటి నుంచి ప్రవేశ పరీక్ష ప్రారంభం
ఎంసెట్లో 'నిమిషం'
నిబంధనను అమలు చేస్తున్నట్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షల ప్రత్యేక
అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని,
విద్యార్థులను గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రం ఆవరణలోకి
అనుమతిస్తారని వెల్లడించారు. ఏపీ ఎంసెట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజుల
పాటు రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో
కలిపి 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంజినీరింగు 1,85,263
మంది, వ్యవసాయ, వైద్య
విద్యకు 87,637 మంది దరఖాస్తు చేశారు. హాల్‌టికెట్స్ కోవిడ్-19 స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని, దాన్ని
పూరించి, పరీక్ష కేంద్రం వద్ద సమర్పించాలి. పరీక్ష కేంద్రం
రూట్ మ్యాప్ ని వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
15 నిమిషాల ముందు పాస్వర్డ్
• హాల్ టికెట్ పై ఉన్న బార్‌కోడ్ ను సిబ్బంది.
స్కాన్ చేసి, కంప్యూటర్ ల్యాబ్కు దారి చూపిస్తారు..
• పరీక్షకు 15 నిమిషాల ముందు మాత్రమే కంప్యూటర్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్
ఇస్తారు.
• నెగెటివ్ మార్కులు లేవు.
• విద్యార్థులు తమ సమాధానాలను
పరీక్ష ముగిసే లోపు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కంప్యూటర్లో ఏమైనా సాంకేతిక సమస్యలు
ఏర్పడితే వెంటనే ఇన్విజిలేటర్‌కు సమాచారం అందించాలి. మరో కంప్యూటర్ ఏర్పాటు
చేస్తారు. పరీక్ష ఎక్కడ నిలిచిపోతే, అక్కడి నుంచి సమయం
ప్రారంభమవుతుంది.
0 Komentar