Nirmala Sitharaman Good news for
employees .. Key decision!
ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ శుభవార్త..
కీలక నిర్ణయం!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ ఉద్యోగులకు తీపికబురు అందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగే
నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌బీఏ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
హెచ్‌బీఏ వడ్డీ రేట్ల తగ్గింపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ ఉద్యోగులకు తీపికబురు అందించారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగానే ప్రయోజనం కలుగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ హౌస్
బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో హెచ్‌బీఏ
వడ్డీ రేట్లు 8.5 శాతం నుంచి 6.64 శాతానికి
దిగిరానుంది.
కేంద్ర ప్రభుత్వం గతంలోనే 7వ
వేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం హౌస్ బిల్డింగ్
అడ్వాన్స్ నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ మాట్లాడుతూ.. హెచ్‌బీఏ వడ్డీ రేటు పదేళ్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్‌లో
అనుసంధానమై ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం హౌసింగ్ బిల్డింగ్
అడ్వాన్స్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. 2019
సెప్టెంబర్ 14న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈల్డ్ 6.64 శాతంగా ఉంది. దీంతో హెచ్‌బీఏ వడ్డీ రేటు 6.64
శాతానికి దిగిరానుంది. దీంతో ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. సాధారణంగా కేంద్ర
ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి కొనుగోలు కోసం 34 నెలల బేసిక్ శాలరీ
లేదా రూ.25 లక్షలులేదా ఇంటి ధర లేదా ఉద్యోగి చెల్లించగలితే
సామర్థ్యం వంటి వాటిల్లో ఏది తక్కువ అయితే అంతవరకు ముందుగానే డబ్బులు తీసుకోవచ్చు.
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం
ఉద్యోగులకు మరో శుభవార్త అందించింది. సర్కార్ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో
కార్మిక సంస్కరణల్లో భాగంగా మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఆక్యూపెషనల్ సేఫ్టీ
హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్ కోడ్ 2020, ఇండస్ట్రీయల్
రిలేషన్స్ కోడ్ 2020 (సోషల్ రెగ్యులేషన్ కోడ్ 2020), సోషల్ సెక్యూరిటీ కోట్ 2020 అనేవి ఇవి. సోషల్
సెక్యూరిటీ కోడ్‌కు చాలా నిబంధనలను జోడించారు. గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను
కూడా మారబోతున్నాయి. దీంతో కంపెనీలో కనీసం ఐదేళ్ల పని చేయాల్సిన అవసరం
ఉండకపోవచ్చు.
0 Komentar