NDLI: From KG to PG .. Everyone can read
books here for free
కేజీ నుంచి పీజీ వరకు.. ఇక్కడ
అందరూ ఉచితంగా చదువుకోవచ్చు
ఒకటో తరగతి నుంచి పోస్ట్
గ్రాడ్యుకేషన్ వరకు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లందరికీ
పూర్తి సమాచారాన్ని ఎన్‌డీఎల్‌ఐ అందిస్తోంది.
47 లక్షల ఆర్టికల్స్.. 70 లక్షల పుస్తకాలు ఒకే చోట
పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే
వాళ్లకి బహు లాభం
ఒక్కసారి రిజిస్టరైతే ఎనీ టైమ్
చదువుకోవచ్చు
విద్యకు సంబంధించిన పుస్తకాల కోసం
యువత ఇక గ్రంథాలయాల చుట్టూ, బుక్‌షాప్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం..
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) యాప్ రూపంలో అందుబాటులోకి
తెచ్చింది.
ఇందులో అత్యంత ప్రామాణిక కంటెంట్
ఉంటుంది. టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్,
అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో
నిష్ణాతులైన కంటెంట్ హోస్టులు, 100కి పైగా అభ్యసన సాధనాలు,
90 లక్షల మంది అందించిన 47 లక్షల ఆర్టికల్స్,
దాదాపు 70 లక్షల పుస్తకాలు.. ఇవీ స్థూలంగా
నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) ప్రత్యేకతలు. https://ndl.iitkgp.ac.in/వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలుంటాయి.
గత ప్రశ్నాపత్రాలు, వ్యవసాయం,
చరిత్ర, టెక్నాలజీ, కంప్యూటర్,
సైన్స్ ,సోషియలాజీ, ఆంత్రోపాలజీ,
విద్య పరిశోధన, భౌతికశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర పుస్తకాలు ఈ యాప్ ఆధారంగా చదువుకోవచ్చు.
ఇంటర్నెట్ ఉంటే చాలు ఏదో ఒకచోట
కూర్చొని అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. జాతీయ
విద్యా మిషన్‌లో భాగంగా జాతీయ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. అన్నిరకాల
పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఇందులో అందుబాటులో ఉంచింది. వీడియో పాఠాలను సైతం
ఉచితంగా అందిస్తోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన
మెటీరియల్ కూడా ఇందులో ఉంచింది.
ఖాతా రిజిష్టర్ ప్రాసెస్ ఇదే..!
నేషనల్ డిజిటల్ లైబ్రరీలో
పుస్తకాలు ఉచితంగా చదివేందుకు ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్
చేసుకోవాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎన్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
మెయిల్ ఐడీ ద్వారా కూడా రిజిష్టర్
చేయించుకోవాల్సి ఉంటుంది.
ఏయే పుస్తకాలు కావాలి. ఏ
విద్యాసంస్థలో చదువుతున్నారు.. వంటి పూర్తి వివరాలు అందులో అప్‌లోడ్ చేయాల్సి
ఉంటుంది.
ఒకసారి రిజిష్టర్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో
ఎప్పుడైనా చదువుకోవచ్చు.
0 Komentar