No Postponement of Civils Prelims Exam: UPSC
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
వాయిదా వేయడం కుదరదు: యూపీఎస్సీ
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను
వాయిదా వేసే అవకాశం లేదని సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ తెలిపింది.
అక్టోబర్ 4న
జరగాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని
సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో సివిల్స్
ప్రిలిమ్స్ పరీక్షను వాయిదావేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు
విచారణ చేప్టింది. ఈసందర్భంగా పరీక్షను వాయిదావేయడం సాధ్యంకాదని యూపీఎస్సీ తరఫు
న్యాయవాది అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.
అయితే వాయిదా వేయలేకపోవడానికి
కారణాలు తెలపాలని, దానికి సంబంధించి రేపు అఫిడవిట్ దాఖలు
చేయాలని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది.
తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదావేసింది.
షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 4న జరగాల్సి ఉంది. అయితే
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. వివిధ రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో పరీక్షను
రెండు నుంచి మూడు నెలలపాటు వాయిదా వేయాలని 20 మంది అభ్యర్థులు
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కరోనా మహమ్మారిని నిలువరించడానికి
దేశంలో లాక్‌డౌన్ విధించడంతో మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్
పరీక్ష వాయిదాపడింది. అనంతరం జూన్ 6న సవరించిన పరీక్షల
తేదీలను ప్రకటించింది. అక్టోబర్ 4న ప్రిలిమ్స్ జరుగుతుందని
వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల
చేసింది.
0 Komentar