తెలంగాణ వైద్య
ఆరోగ్య శాఖ పోస్టులకు నోటిఫికేషన్
మెడికల్ అండ్
హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ద్వారా తొలి
నోటిఫికేషన్ విడుదలైంది.
వైద్య
ఆరోగ్యశాఖలో నియామకాల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్
రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ద్వారా తొలి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ బుధవారం నోటిఫికేషన్‌ను జారీ
చేశారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో మెడికల్ ప్రొఫెసర్లు,
వైద్యుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.
మొత్తం 36
పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధులు.. అక్టోబరు 23 వరకు
దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్యర్ధులు మరిన్ని వివరాల
కోసం https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను
సంప్రదించవచ్చు.
మొత్తం ఖాళీలు: 36
ప్రొఫెసర్- 4
అసోసియేట్
ప్రొఫెసర్ - 3
అసిస్టెంట్
ప్రొఫెసర్ - 20
మెడికల్ ఆఫీసర్
- 2
లెక్చరర్ - 1
సీనియర్
రెసిడెంట్స్ - 6
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టులను
బట్టి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీ, ఎంఎస్, ఎండీఎస్,
ఎంసీహెచ్, డీఎం, డీఎన్‌బీ,
పీహెచ్‌డీ తదితరాలు ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: బ్లండ్
బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గరిష్టంగా 34 ఏళ్లు, లెక్చరర్ పోస్టులకు 35 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
ప్రొఫెసర్ పోస్టులకు రూ.2వేలు, అసోసియేట్/అసిస్టెంట్
ప్రొఫెసర్ పోస్టులకు రూ.1500, లెక్చరర్/మెడికల్ ఆఫీసర్
పోస్టులకు రూ.1000, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు రూ.500.
ఎంపిక: అకడమిక్
మెరిట్,
ఎక్స్‌పీరియన్స్, రీసెర్చ్ అనుభవం ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు
ప్రారంభం: సెప్టెంబర్ 24, 2020
దరఖాస్తుకు
చివరితేది: అక్టోబర్ 23, 2020
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in/
0 Komentar