Online courses in regional languages -
UGC new project in Covid time
ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ కోర్సులు - కోవిడ్ నేపథ్యంలో యూజీసీ కొత్త ప్రణాళిక
ఆత్మ నిర్భర్ భారత్ కు అనుగుణంగా
కార్యక్రమాలు
ప్రధాని మోదీ ప్రకటించిన
ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా యూజీసీ ప్రణాళిక చేపట్టింది. ఆన్లైన్
కోర్సులు,
డిజిటల్ ఎడ్యుకేషన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా సిద్ధమైంది.
ఇప్పటికే స్వయం, స్వయంప్రభ, వర్చువల్
ల్యాబ్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఈ-పీజీ
పాఠశాల తదితరాలు అందుబాటులో ఉండగా కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఉపకరించేలా
వీటిని పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ
కోర్సుల ద్వారా విద్యార్థులకు అందించే క్రెడిట్లను వారు చదువుకునే విద్యాసంస్థలు,
వర్సిటీలకు బదిలీ చేయనున్నారు. దీనికి సంబంధించి క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఆన్లైన్
లెర్నింగ్ ను ఇప్పటికే రూపొందించింది.
- యూజీసీ కొన్ని విద్యాసంస్థల ద్వారా మాసిప్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్
(మూక్స్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లో చేరడం ద్వారా విద్యార్థుల
పరిజ్ఞానం పెంపొందుతుందని యూజీసీ భావిస్తోంది. ఆన్లైన్ కోర్సుల్లో చేరేలా
విద్యార్థులను ప్రోత్సహించాలని వర్సిటీలకు సూచిస్తోంది. అధ్యాపకులు కూడా తమ
నైపుణ్యాలను పెంచుకునేందుకు వీటిని వినియోగించుకో వాలని సూచనలు చేసింది.
- ఆత్మ
నిర్బర్ భారత్ గురించి విద్యార్థులకు మరింత అవగాహన కల్పించాలని యూజీసీ పేర్కొంది.
0 Komentar