Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Over Lakh job vacancies in the Central Armed Forces - CAPFs, BSF, CRPF



Over One Lakh job vacancies in the Central Armed Forces - CAPFs, BSF, CRPF
కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగ ఖాళీలు
బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ప్రధానాంశాలు:
బీఎస్‌ఎఫ్‌లో అత్యధికంగా దాదాపు 29 వేల ఖాళీలు
చాలా వరకు కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులు

కేంద్ర సాయుధ బలగాల్లో లక్ష ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో చాలా వరకు పదవీ విరమణ, మరణాలు, రాజీనామాల వల్ల ఏర్పడ్డ ఖాళీలేనని తెలిపింది.

ఈ మేరకు సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌లో 28,926 ఖాళీలు ఉన్నాయన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 26,506, సీఐఎస్‌ఎఫ్‌లో 23,906, ఎస్ఎస్‌బీలో 18,643, ఐటీబీపీలో 5,784, అస్సాం రైఫిల్స్‌లో 7,328 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో చాలా వరకు కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులేనని తెలిపారు.

నిర్దిష్ట ప్రక్రియ ద్వారానే వీటిని భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. వీటిలో కొన్ని పదోన్నతులు, డిప్యూటేషన్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరికొన్నింటికి కొత్తగా నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం 60,210 కానిస్టేబుల్‌, 2,534 ఎస్ఐ పోస్టులు స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ద్వారా.. 330 అసిస్టెంట్‌ కమాండెట్స్‌ పోస్టుల్ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags