Permission for staff replacement in
RGUKT
ఆర్జీయూకేటీలో సిబ్బంది భర్తీకి అనుమతి
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్
నాలెడ్జ్ టెక్నాలజీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి
అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం, ఒంగోలుల్లోని
ఆర్జీయూకేటీల్లోని 420 టీచింగ్, 178
నాన్ టీచింగ్ పోస్టుల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర సోమవారం
ఉత్తర్వులు విడుదల చేశారు.
పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్
గా కొనసాగుతున్న డి. దేవానందరెడ్డికి అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు విడుదల
చేశారు. దేవానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ గా, పబ్లిక్
లైబ్రరీస్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నారు.
0 Komentar