Safety Precautions to Prevent Electric
Shocks in The House
ఇంట్లో
కరెంటు షాక్‌లు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఇప్పుడు
సమస్త జగత్తు ఆధారపడుతున్న కరెంట్ అనేది ఇంట్లో సర్వసాధారణమైపోయింది. మరి దీనిని
వాడేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం...
ఎలక్ట్రిసిటీ
విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, కొన్ని
ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ప్రాణాంతకం కావచ్చు. చిన్న చిన్న విషయాలే అనుకుని
వదిలేసే పాతబడిపోయిన ప్లగ్ పాయింట్స్, సరైన
ఇన్సులేషన్ లేని టూల్స్, డ్యామేజ్ అయిన
వైర్లూ చాలా ప్రాబ్లంస్ కి కారణం కావచ్చు. అందుకే, అలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా అందరూ హ్యాపీ గా ఉండడం కోసం ఇక్కడ కొన్ని
సూచనలున్నాయి.
1. మీరు వాడుతున్న అప్లయన్సెస్ కి సరైన ఓల్టేజ్ వాడుతున్నారో లేదో చూసుకోండి.
అప్పుడు ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్ నుండి తప్పించుకోవచ్చు.
2. పవర్ ఔట్లెట్స్ ఏవీ ఓవర్ లోడ్ అవ్వట్లేదు కదా అని చెక్ చేసుకోండి. ఈ ఔట్లెట్స్
తాకితే చల్లగా ఉండాలి, ఫేస్ ప్లేట్స్
ఉండాలి,
వర్కింగ్ కండిషన్ లో ఉండాలి.
3. అప్లయెన్సెస్ కి ఎక్స్టెన్షన్ కార్డ్స్ యూజ్ చేయకండి. ఔట్లెట్స్ వేడిగా ఉంటే
ఎలక్ట్రీషియన్ మాత్రమే వాటిని చెక్ చేయాలి.
4. వైర్లు పాడైతే వెంటనే మార్చేయండి. లేదా, రిపెయిర్
చేయించండి. వీటిని స్టేపిల్ చేయరాదు.
5. ఎలక్ట్రికల్ వైర్లు కార్పెట్స్ కింద నుండీ, రగ్గుల కింద
నుండీ వెళ్ళకూడదు.
6. ఫర్నిచర్ కింద వైర్లు ఉంటే ఇన్సులేషన్ క్రష్ అయ్యే అవకాశం ఉంది.
7. ఎక్స్టెన్షన్ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే అర్ధం మీ ఇంట్లో
అవసరమైనన్ని ఔట్లెట్స్ లేవని అర్ధం. మీకు అవసరమైన రూంస్ లో ఔట్లెట్స్ ఏర్పాటు
చేయించుకోండి.
8. మీరు వాడని వైర్లనీ, కొత్త వైర్లనీ
జాగ్రత్తగా దాచండి. ఇవి మీ పిల్లలకి కానీ, మీ పెంపుడు
జంతువులకి కానీ అందుబాటులో లేకుండా చూడండి.
9. వైర్లన్నీ ఏదైనా వస్తువుకి గట్టిగా చుట్టి ఉంచితే వైర్ సాగి పోతుంది. దాని
వల్ల ఓవర్ హీటింగ్ జరుగుతుంది.
10. వేడి గా ఉన్న వస్తువుల మీద కానీ పక్కన కానీ వైర్లని ఉంచకండి. ఇన్సులేషన్
డ్యామేజ్ అవుతుంది.
11. మీరు వాడని అప్లయెన్సెస్ యొక్క వైర్లని ప్లగ్ నుండి తీసేయండి. దీని వల్ల పవర్
కన్సంప్షన్ తగ్గడమే కాదు, పవర్ ఫ్లక్చుయేషన్
నుండి మీ అప్లయెన్స్ ని కాపాడుకున్న వారౌతారు.
12. ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ వేటినీ నీటికి దగ్గరగా ఉంచకండి. పొడి చేతులతో
వైర్లనీ,
స్విచెస్ నీ తాకాలి.
13. మీ అప్లయెన్సెస్ ఊపిరి పీల్చుకునే స్పేస్ వాటికి ఇవ్వండి. సరైన ఎయిర్
సర్క్యులేషన్ లేకపోతే ఒవర్ హీట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ జరగవచ్చు.
14. తలుపులు మూసి ఉన్న కాబినెట్స్ లో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ వాడకండి.
15. మీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ క్లీన్ గా ఉండేలా చూసుకోండి.
16. అప్లయెన్సెస్ కొన్నప్పుడు ఇచ్చే సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ని పూర్తిగా ఫాలో
అవ్వండి. దీని వల్ల మీ అప్లయెన్స్ బాగా పని చేయడమే కాదు, మీరు సేఫ్ గా ఉంటారు.
17. ఏ అప్లయెన్స్ నుండైనా మీకు అతి చిన్న షాక్ తగిలినా సరే, వెంటనే ఆ అప్లయెన్స్ ని యూజ్ చేయడం ఆపేసి ఎలక్ట్రీషియన్
ద్వారా బాగు చేయించుకోండి.
18. పోర్టబుల్ హీటర్స్ ఎప్పుడూ కర్టెన్స్ కి దగ్గరగా ఉండకూడదు.
19. ఎలక్ట్రికల్ వైరింగ్ ని ఎప్పుడూ క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ చేతనే
చేయించుకోవాలి.
20. ఇంట్లో చిన్న పిల్లలుంటే అన్ని ఔట్లెట్స్ కీ సేఫ్టీ కాప్స్ ఇన్స్టాల్ చేయండి.
ఇందు వల్ల పిల్లలు ప్లగ్ పాయింట్స్ లో వేళ్ళు పెట్టడం, వస్తువులు దూర్చడం వంటివి చేయడానికి వీలుండదు.
21. ఎలక్ట్రికల్ వైర్లని లాగకూడదని మీ పిల్లలకి నేర్పించండి. ఔట్లెట్స్ లో నుండి
ప్లగ్ ని తీయాలి తప్ప వైర్ ని లాగకూడదని వారికి తెలియచెప్పండి.
22. డేంజరస్ అప్లయెన్సెస్ పిల్లలకి అందకుండా జాగ్రత్త చేయండి. టోస్టర్స్, బ్లెండర్స్, కెటిల్స్
వంటివి వారికి అందుబాటులో లేకుండా ఉంచండి.
23. పిల్లలకి ఎలక్ట్రిసిటీ గురించీ, ఎలక్ట్రికల్
సేఫ్టీ గురించీ అన్నీ నేర్పించాకే వారికి ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ వాడడానికి ఇవ్వండి.
అప్పుడు కూడా మొదట్లో కొన్ని సార్లు మీరు వారి పక్కనే ఉండి ఏమైనా తప్పులు
చేస్తున్నారేమో గమనిస్తూ ఉండండి.
24. మీ ఇంట్లో ఇన్వర్టర్ కానీ, జనరేటర్ కానీ ఉంటే
వాటి సేఫ్టీ రూల్స్ తెలుసుకుని ఉండండి.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ
వివరాలను అందించాం.
« Prev Post
Next Post »
0 Komentar