Prepare a list of voters for MLC
elections - Central Electoral Commission
మండలి ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్దం
చేయండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సీఈఓలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో ఉపాద్యాయ, తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాల
రూపకల్పనకు భారత ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి
ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన రాము సూర్యారావు (తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు), ఏ.ఎస్. రామకృష్ణ (కృష్ణా,
గుంటూరు జిల్లాలు), తెలంగాణలోని పట్టభద్రుల
నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎన్.రామ చంద్రరావు (మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లాలు), పల్లా రాజేశ్వర్ రెడ్డి (వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు)ల పదవీకాలం 22 మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా
ఓటర్ల జాబితాలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఈసీలు ఆదేశించింది. నవంబరు 1 వరకు అర్హులైన
వారిని ఓటర్లుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఓటర్ల జాబితా షెడ్యూల్
అక్టోబరు 01 - ఓటర్ల నమోదు స్వీకరణ ప్రకటన జారీ
అక్టోబరు 15 - ఓటర్ల నమోదు స్వీకరణ తొలి పును ప్రకటన జారీ
అక్టోబరు 25 - ఓటర్ల నమోదు స్వీకరణకు మలి పున ప్రకటన జారీ
నవంబరు 08 - దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ
డిసెంబరు 1 ముసాయిదా
ఓటర్ల జాబితా ప్రచురణ
డిసెంబరు 01 నుంచి 31 వరకు - అభ్యంతరాలు,
ఏర్యాదుల స్వీకరణ
డిసెంబరు 12 - అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం
2021, జనవరి 18 - ఓటర్ల తుది జాబితా ప్రచురణ
0 Komentar