Prestigious award for Sonu Sood:
Recognition for services
సోనూ సూద్‌కు ప్రతిష్టాత్మక
అవార్డు: సేవలకు గుర్తింపు.. దిగ్గజాల సరసన చోటు
సోనూ సూద్‌ను ప్రతిష్టాత్మక
పురస్కారం వరించింది. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన యునైటైడ్ నేషన్స్
డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (UNDP) సోనూను గౌరవించింది.
కరోనా భయానక పరిస్థితుల్లో
నిస్వార్థంతో కొన్ని లక్షల మంది వలస కార్మికులను వారి ఇళ్లకు పంపడమే కాకుండా ఆపదలో
ఉన్నాం ఆదుకోండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ప్రముఖ నటుడు, రియల్
హీరో సోనూ సూద్‌ను ఐక్యరాజ్య సమితి గౌరవించింది. ప్రతిష్టాత్మక ‘ఎస్‌డీజీ స్పెషల్
హ్యుమనిటేరియన్ యాక్షన్’ అవార్డును యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP)
సోనూ సూద్‌కు ప్రకటించింది. ఈ అవార్డును సోమవారం (సెప్టెంబర్ 29న) ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేడుక ద్వారా సోనూ సూద్‌కు అందజేసింది.
ఈ అవార్డును స్వీకరించడం ద్వారా
ఏంజెలినా జూలీ, డేవిడ్ బెక్‌హామ్, లీయోనార్డో
డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్
నీసన్, కేట్ బ్లాంకెట్, ఆంటోనియో
బాండెరస్, నికోలెస్ కిడ్మన్, ప్రియాంక
చోప్రా సరసన సోనూ సూద్ నిలిచారు. సినిమా, క్రీడలు తదితర
రంగాలకు చెందిన వీరంతా పలు యూఎన్ బాడీస్ నుంచి ఇలాంటి గౌరవాన్నే పొందారు. కాగా,
యూఎన్ అవార్డును పొందడంపై సోనూ సూద్ ఆనందం వ్యక్తం చేశారు.
‘‘ఇది అరుదైన గౌరవం. యూఎన్
గుర్తింపు అనేది ఎంతో ప్రత్యేకం. ఏమీ ఆశించకుండా నా దేశ ప్రజలకు నాకు తోచినంత సాయం
చేశాను. ఆ సేవలకు గుర్తింపు రావడం, అవార్డు తీసుకోవడం చాలా
గొప్పగా అనిపిస్తోంది. 2030 నాటికి యూఎన్‌డీపీ తన రాయబారుల
ద్వారా లక్ష్యాలను అందుకోవడానికి నా పూర్తి సహకారం అందిస్తాను. ఈ లక్ష్యాలను
అమలులోకి తీసుకొస్తే ఈ భూమి, జీవికోటికే లాభం’’ అని సోనూ
సూద్ వెల్లడించారు. ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలని, భూగోళాన్ని
రక్షించాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితి.. 2030 నాటికి ఈ
భూమి మీద ఉన్న ప్రజలకు శాంతి, శ్రేయస్సును అందించడమే
ధ్యేయంగా పెట్టుకుంది.
0 Komentar