Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Protest against new education policy: APTF


Protest against new education policy: APTF
విద్యావిధానంపై రేపు నిరసన: ఏపీటీఎఫ్
 మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, వేదికల ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా నూతన జాతీయ విద్యావిధానం 2020 ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ రేపు జాతీయ స్థాయి లో నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకటేశ్వరరావు, జి. హృదయరాజు తెలిపారు.
అఖిల భారత విద్యా సంఘాల వేదిక (ఏఐఎఫ్ ఆర్ టీఈ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాతీయ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయించామన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో పార్లమెంట్ ప్రమేయం లేకుండా NEP ని ప్రకటించడం ఇదే ప్రథమమన్నారు. కొత్త విధానం ఉన్న సమస్యలను పరిష్కరించేదిగా కాకుండా, కొత్త సమస్యలు సృష్టించేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో రేపు నిర్వహించబోయే నిరసనల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags