Railways huge announcement - 1.4 lakh jobs
రైల్వే శాఖ భారీ ప్రకటన – 1.4 లక్షల
ఉద్యోగాలు
రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాల
భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక కటన చేసింది. దేశవ్యాప్తంగా 1.40 లక్షల ఉద్యోగాల నియామకానికి డిసెంబర్ 15 నుంచి
పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు
ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. మూడు విభాగాల్లో 1.4 లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే
పూర్తయిందన్నారు. రైల్వేలో మూడు కేటగిరీల కింద 1,40,640
ఉద్యోగాల కోసం రైల్వేశాఖ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే, అభ్యర్థులందరికీ
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ
పరీక్షలు వాయిదా పడ్డాయని వీకే యాదవ్ తెలిపారు. పూర్తి షెడ్యూల్ ను అతి త్వరలోనే
ప్రకటిస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ, నీట్
పరీక్షలు జరుగుతుండటంతో వాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వల్ల నిలిచిపోయిన
ఈ పరీక్షలను కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన
మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.
రైల్వేశాఖ గతంలో జారీచేసిన
నోటిఫికేషన్ ప్రకారం నాన్ టెక్నికల్ పాపులారిటీ కేటగిరీ (ఎన్‌టీపీసీ) కింద
గార్డులు,
ఆఫీస్ క్లర్క్ లు, కమర్షియల్ క్లర్క్ ల
పోస్టులు 35,208 కాగా... మినిస్టీరియల్ కేటగిరీ ఉద్యోగాలైన
స్టెనో తదితర ఉద్యోగాలు 1663; అలాగే, ట్రాక్
నిర్వహణ, పాయింట్ మెన్ వంటి ఉద్యోగాలు 1,03,769లను భర్తీ చేయనున్నారు.
0 Komentar