ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్
భారత ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ
ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలనే, ఏషియన్
డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేరిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.
జార్ఖండ్ క్యాడర్‌కి చెందిన ఈ 1984 బ్యాచ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి రాజీవ్ కుమార్
ఐదేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగి, 2025లో రిటైర్ అవుతారు. 2024
సార్వత్రిక ఎన్నికలు ఈయన నేతృత్వంలో జరగనున్నాయి. నిబంధనల ప్రకారం కమిషనర్ ఆరేళ్ల
పదవిలో ఉండాల్సి ఉండగా, 2025 ఫిబ్రవరిలో 65 ఏళ్లు నిండ
డుతో ఈయన ఒక ఏడాది ముందుగానే
రిటైర్ కానున్నారు.
0 Komentar