Reassessment of checks above Rs. 50,000 - 'Positive Pay System'
రూ.50,000పైన చెక్కులకు
పునః నిర్ధారణ - ‘పాజిటివ్ పే సిస్టమ్’
బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట
వేసేందుకు జనవరి 1, 2021 నుంచి చెక్కులకు ‘పాజిటివ్ పే సిస్టమ్’ ను అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) నిర్ణయించింది.
దీని కింద రూ.50000 పైబడ్డ చెక్కులు చెల్లింపులు విషయంలో
కీలక వివరాలను పునః నిర్ధారణ చేస్తారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలా వద్దా
అన్నది ఖాతాదారు విచక్షణకే వదిలివేయనున్నారు. అయితే రూ. 5 లక్షలు,
ఆపై మొత్తాలున్న చెక్కులకు ఈ విధానాన్ని బ్యాంకులు తప్పనిసరి చేయడాన్ని
పరిశీలించవచ్చు. ‘పాజిటివ్ పే సిస్టమ్' కింద చెక్కు
జారీదారు ఎస్ఎమ్ఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్
బ్యాంకింగ్ లేదా ఏటీఎమ్ ద్వారా చెక్కుకు సంబంధించిన కనీస వివరాలు ఎవరి పేరిట
ఇచ్చారు. మొత్తం, నగదు ఉపసంహరణ చేసే బ్యాంకు, తేదీ)ని సమర్పించాల్సి ఉంటుంది. చెక్కును చెల్లింపు కోసం తీసుకెళ్లినపుడు
బ్యాంకు అధికారులు ఈ వివరాలను తనిఖీ చేసుకుంటాడు. ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే
తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని RBI తెలిపింది.
0 Komentar