Registration to be completed within ten
minutes
పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్
పూర్తయ్యేలా ఏర్పాట్లు: కేసిఆర్
చాలాకాలం నుండి ఉన్న భూ వివాదాల
పీడ విరగడయ్యేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్
శాసనమండలిలో స్పష్టం చేశారు. పేద రైతులకు ప్రయోజనంతో పాటు ఒక్క పైసా అవినీతికి
తావులేని పద్ధతిలో మూడేళ్లు కష్టపడి చట్టానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేవలం
పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు
చేస్తున్నామన్నారు. మండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ
పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం
తహసీల్దార్లకు సైతం లేదని తేల్చి చెప్పారు. బయోమెట్రిక్, ఐరిస్,
ఆధార్, ఫోటోతో సహా అన్ని వివరాలు నమోదు
చేస్తేనే ధరణి పోర్టల్ లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్,
మ్యుటేషన్, అప్ డేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి
చేసే వ్యవస్థ తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. రెవెన్యూ కోర్టులు రద్దు చేశామని,
వాటి స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రైబ్యునలు పని చేస్తాయని సీఎం
వెల్లడించారు. కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని
చెప్పారు.
0 Komentar