RGUKT Notification for admissions of
1492 students
ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ విడుదల, 1492 మంది విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్
నిర్మల్ జిల్లాలోని బాసర RGUKT లో సాంకేతిక విద్యలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబందించి ప్రవేశాలకు
విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి
గానూ 1492 సీట్ల భర్తీకి అర్జీయూకేటీ ఎంపిక ప్రక్రియ
చేపట్టింది. ఈ మేరకు విద్యాలయ ఏవో రాజేశ్వరరావు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
విద్యార్థులు సెప్టెంబరు 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు
చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ అక్టోబరు 3. ఆంధ్రప్రదేశ్
లో పదో తరగతి ఫలితాలు వచ్చినా.. గ్రేడ్లను ప్రకటించకపోవటంతో ఆ రాష్ట్ర
విద్యార్థులు పోటీపడే 15 శాతం సీట్ల భర్తీకి సంబంధించి
సందిగ్ధత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని
తెలిపింది. అక్టోబరు 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గ్రేడ్ లను ప్రకటిస్తే విద్యార్థులను ఎంపిక చేస్తామని విద్యాలయం ప్రకటించింది.
ఏవైనా సందేహాలుంటే 9573001992, 9703760686 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. admissions@rgukt.ac.in మెయిల్ ఐడీకి కూడా సందేహాలను పంపవచ్చని పేర్కొన్నారు
When is the selection list will be released
ReplyDeletehttps://admissions.rgukt.ac.in/adm/ug
Delete