Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Russia corona vaccine - First batch available to the public


Russia corona vaccine - first batch available to the public
రష్యా కరోనా వ్యాక్సిన్  - ప్రధమ బ్యాచ్ అందుబాటులోకి
రష్యా రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ స్పుత్నిక్ తొలి బ్యాచ్‌ను ప్రజల కోసం రిలీజ్ చేశారు. త్వరలోనే ఇది ప్రాంతాల వారీగా అందరికీ అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ తొలి బ్యాచ్‌ను ప్రజల కోసం విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరలోనే ప్రాంతాల వారీగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ప్రపంచంలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను రూపొందించామని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ భద్రతపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేసినా.. ఆగస్టు 11న మాస్కో దీన్ని రిజిస్టర్ చేసింది.

‘‘కరోనా ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకునే స్పుత్నిక్ ‘Gam-COVID-Vac’ వ్యాక్సిన్ అన్ని క్వాలిటీ పరీక్షలను పూర్తి చేసుకుంది. ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమాలజీ, మైక్రోబయాలజీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ రష్యా రూపొందించినట్లు స్పష్టం చేసింది.

ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఈ వారం ప్రారంభమవుతాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మురాస్ఖో ప్రకటించారు. కొద్ది నెలల వ్యవధిలోనే మెజార్టీ మాస్కో వాసులకు టీకా అందుతుందని నగర మేయర్ సెర్గే సొబియానిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్ సహా పలు దేశాల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ఈ నెల ప్రారంభమవుతాయని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మెక్సికో, బ్రెజిల్ సహా 20 దేశాలు... వ్యాక్సిన్ కోసం సుముఖత వ్యక్తం చేశాయన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags