Salaries should be paid to private teachers
Salaries should be paid to private
teachers
ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాల్సిందే
జీతాలు ఇవ్వని యాజమాన్యాలకు
నోటీసులు
డీఈఓలకు తాజాగా అందిన ఆదేశాలు
ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో
పనిచే స్తున్న ఉపాధ్యాయ, అధ్యాపకులు జీతాలు ఇవ్వని
యాజమాన్యాలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. టీచర్లుకు జీతాలు ఇవ్వని పాఠశాలల
యాజమా న్యాల వారికి నోటీసులు జారీ చేయాలని డీఈఓలను ఆదే శిస్తూ బుధవారం పాఠశాల
విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. లాక్ డౌన్
విధిం చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వారు వేతనాలు
చెల్లించటం లేదని వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనిపై సానుకూలంగా
స్పందించిన ప్రభుత్వం ప్రైవేటు టీచర్లును యాజమాన్యం వారు ఆదుకో వాల్సిందేనని
స్పష్టం చేసింది. ఇదే విషయమై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ
చేశారు. ఉపాధ్యాయలకు వేతనాలు ఇప్పించే బాధ్యతలను తీసు కోవాలని డీఈఓలకు ఆదేశాలు
జారీ చేశారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని డీఈఓ ఎంవీ రాజ్య లక్ష్మి
డెప్యూటీ డీఈఓ, ఎంఈఓలకు సూచించారుఅయినప్పటికీ, ప్రైవేటు యాజమాన్యం వారు ఆదేశాలను భేఖాతరు చేస్తూ, పాఠశాలలు
తెరువనందున వేతనాలు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో
పనిచేస్తున్న జిల్లాలోని సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ, అధ్యాపక
కుటుంబాలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీనిపై ఇటీవల ఆందోళన కార్యక్రమాలను
చేశారు. దీనిపై సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలకు
సిద్ధమైంది. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ, విద్యార్థుల
నుంచి ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం
అడ్మిషన్లు చేస్తు న్నారు. పాఠశాలలు ఎప్పుడు తెరిచినా, ఏడాది
ప్రాతిపది కనే ఫీజులు వసూలు చేసే అవకాశం ఉన్నందున ఉపా ధ్యాయుల వేతనాలకు కోత
పెట్టడం సరైంది కాదనే వాద నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై
స్పందించింది. ఈ మేరకు ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలను
గుర్తించాలని డీఈఓలకు తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు
ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలకు నోటీసులు జారీ
చేసి, చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావాలని తాజాగా జారీ
చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
You may also like these Posts
0 Komentar