ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో
సెయింట్ జాన్స్ విద్యార్థి
కృష్ణా జిల్లా గన్నవరంలోని వీఎస్
సెయింట్ జాన్స్ హైస్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థి ఎన్.ఎస్.కృష్ణవంశీ ది
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. కోవిడ్-19
వ్యతిరేక పోరాటానికి సహాయపడే ఆటోమాటిక్ కాంటాక్ట్ శానిటైజర్ యంత్రాన్ని తక్కువ
ధరలో తయారు చేసినందుకు కృష్ణవంశీకి ఈ అరుదైన గొరవం దక్కింది. అంతే కాకుండా పిన్న
వయస్సులో ఈ ఘనత సాధించినందుకు వంశీకృష్ణకు మెడల్ ఆఫ్ ఆనర్ సర్టిఫికెట్‌ను కూడా
ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణను పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ సంతోష్
కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
0 Komentar