Supreme Court rejects AP government
request on English Medium
ఏపీ ప్రభుత్వ ఆంగ్ల మీడియం అభ్యర్థనను
తిరస్కరించిన సుప్రీం
ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో
మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ
ప్రభుత్వం అత్యున్నగ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన
జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్ధనను
తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున
సీనియర్ నా కువాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఒకటో తరగతి
నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం
తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని
విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన
కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని దర్మాసనం
పిటిషన్ పై స్పందించేందుకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా
ఇవ్వాలని విశ్వనాథన్ ధర్మాసనాన్ని కోరారు. తదుపరి విచారణను
సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది.
0 Komentar