Telangana Government Good News - LRS Fee Reduction
తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ - LRS ఫీజు తగ్గింపు
పాత ఎల్ఆర్ఎస్ ప్రకారం.. గజం రూ.3
వేలలోపు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ధరలో 20 శాతం
చెల్లించాల్సి ఉంటుంది. ఇక గజం రూ.3 వేల నుంచి 5 వేలు ఉన్నవారు రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం
చెల్లించాల్సి ఉంది.
పేద, మధ్య తరగతి
వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగానే
భూముల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) చేసే విధంగా జీవో 131ని
సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మార్కెట్
విలువ ఆధారంగానే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో మంత్రి
కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రిజిస్ట్రేషన్ జరిగిన సమయం నాటి మార్కెట్ విలువను
వర్తింపజేయనున్నారు. క్రమబద్ధీకరణ ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ సీఎస్ ఈ
ఉత్తర్వులు జారీ చేశారు. పాత ఎల్ఆర్ఎస్ స్కీం 2015 కి
సమానంగా ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.
స్థలాల క్రమబద్దీకరణ కోసం ఈ ఏడాది
ఆగష్టు 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 131 జీవోను జారీ
చేసింది.ఈ జీవోపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. పేదల నుండి
ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ జీవోను తీసుకొచ్చారని విపక్షాలు
విమర్శలు గుప్పించాయి.
పాత ఎల్ఆర్ఎస్ ప్రకారం.. గజం రూ.3
వేలలోపు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ధరలో 20 శాతం
చెల్లించాల్సి ఉంటుంది. ఇక గజం రూ.3 వేల నుంచి 5 వేలు ఉన్నవారు రిజిస్ట్రేషన్ ధరలో 30 శాతం
చెల్లించాల్సి ఉంది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ ధరలో 40 శాతం
చెల్లించాలి. రూ.10 వేల నుంచి రూ.20
వేల వరకు ఉంటే రిజిస్ట్రేషన్ ధరలో 50 శాతం.. రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఉన్న వారు రిజిస్ట్రేషన్ ధరలో
60 శాతం.. రూ.50 వేలపైన ఉన్న వారు
రిజిస్ట్రేషన్ ధరలో 100 శాతం చెల్లించాలని తెలిపింది.
LRS: Layout Regularisation Scheme
0 Komentar