The Govt has released guidelines
for permitting schools in AP as per Unlock 4.0
ఏపి లో విద్యాలయాలకి అనుమతి, అన్
లాక్ 4.0 మార్గదర్శకాలని విడుదల చేసిన ప్రభుత్వం
కేంద్రప్రభుత్వ నిబంధనలకు
అనుగుణంగా ఏపీ అలాక్- 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10,
ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి
చేసింది. అంతేకాకుండా అదే రోజు నుంచి పీజీ, పీహెచ్డీ
విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
తెరచుకునేందుకు అనుమతినిచ్చింది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన,
రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి
పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందికి అనుమతి
ఇవ్వాలని నిర్ణయించింది. 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ
సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్
పార్కులకు అనుమతి నిరాకరించింది.
Super information
ReplyDelete