మజ్జిగ తాగడం మరిచిపోయేవారిలో మీరు కూడా ఉన్నారా? జంక్ ఫుడ్ మీద ఇష్టం తో ఇంటి ఫుడ్ వాల్యూ ని మనం ఒకోసారి మరిచిపోతుంటాం. అలాంటి ఇంటి ఫుడ్స్ లో బెస్ట్ అయిన మజ్జిగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగని భోజనం తరువాతైనా తీసుకోవచ్చు, లేదా రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెరుగులో నీరు పోసి బ్లెండ్ చేస్తే మజ్జిగ తయారైపోతుంది. దాన్ని అలాగే తాగొచ్చు, లేదంటే కొద్దిగా జీల కర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చి మిర్చి కలిపి నూరి మజ్జిగలో వేసి తాగొచ్చు. మజ్జిగ తాగితే ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా.
1. అన్ని మాక్రో
న్యూట్రియెంట్స్ ఉంటాయి.
పాలతో పాటు మజ్జిగని కూడా కంప్లీట్ ఫుడ్ అనొచ్చు. బాలెన్స్డ్ డైట్ కి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్స్, ఎస్సెన్షియల్ ఎంజైంస్ అన్నీ ఉన్నాయి. మజ్జిగని ఎప్పుడైనా తాగచ్చు. మజ్జిగలో నీటి శాతం ఎక్కువ కాబట్టి బాడీలో వాటర్ బాలెన్స్ సరిగ్గా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది స్లో గా అబ్జార్బ్ అవుతుంది. మామూలు నీటికంటే కూడా మజ్జిగ తాగడం ఇంకా మంచిది. కొద్దిగా పులిసిన మజ్జిగ రుచికి కొంచెం పుల్లగా ఉంటుంది కానీ, హ్యూమన్ బాడీకి చాలా మేలు చేస్తుంది.
2. డైజెస్టివ్ ట్రాక్ట్ ని
చల్లబరుస్తుంది
మజ్జిగ బాడీ ని చల్లబరుస్తుంది. బాగా స్పైసీ గా ఉన్న ఫుడ్ తిన్న తరువాత స్టమక్ లైనింగ్ ని కూల్ చేస్తుంది. అల్లం, జీల కర్ర పొడి కలిపిన మజ్జిగ ఇలాంటప్పుడు తాగితే ఆ స్పైసీ ఫుడ్ వల్ల వచ్చే ఇరిటేషన్ ని తగ్గించవచ్చు. మజ్జిగ మెనో పాజ్ టైం లో ఉన్న మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. హాట్ ఫ్లాషెస్ తో బాధ పడే వాళ్ళు రెగ్యులర్ గా మజ్జిగ తాగితే ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు. హై మెటబాలిక్ రేట్ ఉన్న పురుషులు కూడా బాడీ హీట్ తగ్గించుకోడానికి మజ్జిగ తాగచ్చు.
3. బ్లోటింగ్ లేకుండా
చూస్తుంది..
బాగా హెవీ గా తిన్న తరువాత కొంచెం బ్లోటెడ్ గా అనిపిస్తుంది కదా. కొంచెం అల్లం, జీల కర్ర పొడి వేసిన మజ్జిగ అరుగుదల కి బాగా సహకరిస్తుంది. స్టఫ్ఫీ గా లేకుండా ఉంటుంది. ఫుడ్ పైప్, మరియూ స్టమక్ లోపలి గోడలకి ఆయిల్ అతుక్కోకుండా చూస్తుంది. అంతే కాక హెవీ మీల్ తరువాత ఉండే లేజీనెస్ ని కూడా బటర్ మిల్క్ పోగొడుతుంది.
4. అరుగుదలకి సహకరిస్తుంది.
పొట్టలో గ్యాస్ బిల్డప్ అవ్వకుండా చూస్తుంది. స్టమక్ ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ని క్యూర్ చేస్తుంది.
5. డీహైడ్రేషన్ రాకుండా
చేస్తుంది..
పెరుగు లో నీటితో పాటూ కొద్దిగా ఉప్పు కూడా వేసి చేసిన మజ్జిగ శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే ఎలక్ట్రొలైట్స్ బాడీ హీట్ ని తగ్గిస్తాయి. వేసవి కాలం లో వచ్చే చెమట కాయలు వంటి సమస్యలు కూడా ఇలా మజ్జిగ తాగడం వల్ల రావు.
6. కాల్షియంని
అందిస్తుంది..
లాక్టోజ్ ఇంటాలరెంట్ వారు హాయిగా మజ్జిగ ద్వారా కాల్షియం ని పొందవచ్చు. ఎందుకంటే పాలలో ఉండే లాక్టోజ్ మజ్జిగ లో లాక్ట్క్ ఆసిడ్ గా రూపాంతరం చెందుతుంది. ఎలాంటి ఎడిషనల్ క్యాలరీస్ లేకుండా మజ్జిగ కాల్షియం ని అందించగలుగుతుంది. దీని వల్ల ఆస్టియో పొరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు తప్పించుకోవచ్చు.
7. విటమిన్స్ తో
సమృద్ధమైనది.
మజ్జిగలో బీకాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలం గా ఉన్నాయి. ఇవి ఎనీమియా నుండి కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ డీ ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తుంది.
8. బాడీని డీటాక్స్
చేస్తుంది
మజ్జిగ లో ఉండే రైబ్లోఫ్లావిన్ ఫుడ్ నుండి ఎనర్జీ రావడానికీ, హార్మోనల్ సెక్రెషన్ కీ, డైజెషన్ కీ కారణమౌతుంది. రైబోఫ్లావిన్ ఇంకా లివర్ కి హెల్ప్ చేస్తుంది, బాడీని డీటాక్స్ చేస్తుంది.
9. బ్లడ్ ప్రెజర్ ని
తగ్గిస్తుంది
మజ్జిగలో బయో యాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. రెగ్యులర్ గా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
10. ఎసిడిటీ తగ్గిస్తుంది
స్టమక్ రిఫ్లక్స్ నీ ఎసిడిటీ నీ తగ్గించడానికి మజ్జిగ ని మించిన మందు లేదు. కొద్దిగా అల్లం నూరి వేసి చేసిన మజ్జిగ స్టమక్ లో ఉండే బర్నింగ్ సెన్సేషన్ ని తగ్గిస్తుంది. స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల స్టమక్ లైనింగ్ ఒకెసారి ఇరిటేట్ అవ్వచ్చు. మజ్జిగ ఆ ఇరిటేషన్ ని కంట్రోల్ చేస్తుంది.
11. కాన్‌స్టిపేషన్ ని
తగ్గిస్తుంది
సరైన టైం లో తినకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వంటివి కాన్‌స్టిపేషన్ కి దారి తీస్తాయి. ఫైబర్ తక్కువ ఉన్నా కూడా ఈ సమస్య వస్తుంది. రోజూ ఒక పెద్ద గ్లాస్ బటర్ మిల్క్ తాగుతూ ఉంటే ఈ సమస్యనించి ఈజీగా బయట పడవచ్చు.
12. బరువుని తగ్గిస్తుంది
నీరసం గా అనిపించకుండా బరువు తగ్గాలంటే మజ్జిగ ఒక్కటే మార్గం. క్యాలరీస్, ఫ్యాట్ లేకుండా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ని మజ్జిగ అందజేస్తుంది. ఆకలి తీరుస్తుంది. బింజ్-ఈటింగ్ వైపు మనసు పోకుండా ఆపుతుంది.
13. బాడీ మాస్ పెంచుతుంది
మజ్జిగ తాగడం వల్ల ప్రోటీన్ ఇన్‌టేక్ పెరుగుతుంది. టిష్యూ రిపెయిర్ మరియూ మెయింటెనెన్స్ కి ప్రోటీన్ అత్యవసరం. మజ్జిగలో ఉన్న ప్రోటీన్స్ వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. ఇది ఎడిషనల్ క్యాలరీలు లేకుండా న్యూట్రియెంట్స్ ని అందిస్తుంది.
14. ఇమ్యూనిటీ ని
పెంచుతుంది
మజ్జిగ లో లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా పుష్కలం గా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ ని పెంచడమే కాక యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేస్తుంది. అయితే, ఇందులో ఉప్పు కలుపుకోకుండా తాగితేనే ఈ ఫలితాలను పొందగలం.
15. నోటి పుండు కి మంచి
మందు
రోజుకి రెండు మూడు పెద్ద గ్లాసుల
మజ్జిగ తాగితే ఈ సమస్య ఈజీగా తగ్గిపోతుంది. ఉప్పు లేకుండా చేసిన పల్చటి మజ్జిగని
నోటి లోపల అటూ ఇటూ తిప్పి మింగేస్తే మౌత్ అల్సర్స్ త్వరగా తగ్గుతాయి.
« Prev Post
Next Post »
0 Komentar