TS: Document Writer for every Mandal-
Government preparing guidelines
మండలానికో దస్తావేజు లేఖరి - మార్గదర్శకాలు
సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలోని తహసీల్దార్
కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంబించనున్న నేపద్యంలో మండలానికి దస్తావేజు
లేఖరిని (డాక్యుమెంట్ రైటర్) నియమించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలన్న ఆలోచనతో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలో ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో
అనుమతి పొందిన దస్తావేజు లేఖరులు 850 మంది వరకూ ఉన్నారు.
లైసెన్సులు లేకుండా లేఖరులుగా పనిచేస్తున్న వారు మరో 4500 మంది
ఉన్నారు. కొత్తగా మండల కేంద్రాల్లో లేఖరులకు అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే
అనుభవం ఉన్న లేఖరులను ప్రతిపాదనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్కో దస్తావేజు
రాసినందుకు వసూలు చేసే రుసుం కూడా నిర్దిష్టంగా ఉండేలా మార్గదర్శకాలు
రూపొందించనున్నారు.
0 Komentar