TS: Engineering EAMCET results will be
on October 6th
ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను
అక్టోబర్ 6న విడుదల
ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను
అక్టోబర్ 6న విడుదల చేసేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది.
వాస్తవానికి 3వ తేదీనే ఫలితాలను విడుదల చేయాలని భావించింది. అయితే ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ కు కరోనా కారణంగా హాజరు కాలేకపోయిన 54 మంది విద్యార్థులకు, ఈసెట్ రాయలేకపోయిన మరో నలుగురు
విద్యార్థులకు అక్టోబర్ 8న పరీక్షలు నిర్వహిస్తోంది. అలాగే
అక్టోబర్ 5న ఇంజనీరింగ్ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాలని
భావించినా, అదే రోజు జేఈఈ అడ్వాన్స్' ఫలితాలు
విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో 6న ఇంజనీరింగ్ ఎంసెట్
ఫలితాలను విడుదల చేయనున్నారు. అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి.
సోమ, మంగళ వారాల్లో ఈ పరీక్షలను నాలుగు విడతలో ఎంసెట్ కమిటీ నిర్వహించింది. వాటికి సంబంధించిన జవాబుల ప్రాథమిక 'కీ'లను రెండు, మూడు రోజుల్లో
అందుబాటులోకి తీసుకురానుంది.
0 Komentar