TS: Inter Board explanation on
syllabus in Intermediate Arts groups ..!
ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల్లో
సిలబస్ పై వివరణ ఇచ్చిన ఇంటర్ బోర్డు..!
ఇంటర్ సిలబస్ తగ్గింపు అంశంపై
వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూపుల్లో సిలబస్ తొలగింపు
గందరగోళంగా మారింది. చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి
శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై వివాదం నెలకొంది.
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాల
తొలగింపుపై విమర్శలు వచ్చాయి.
దీంతో ఇంటర్మీడియట్ బోర్డు
వెనక్కి తగ్గింది. పాఠాల తొలగింపు ప్రతిపాదన మాత్రమేనని.. ఇంకా పరిశీలనలోనే
ఉన్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వివరణ ఇచ్చారు.
జాతీయ నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖులపై
పాఠాలు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల వల్ల నాలుగు
నెలలు వృథా అయినందున 30శాతం సిలబస్ కుదింపునకు ప్రభుత్వం
అంగీకరించిందని ఉమర్ జలీల్ తెలిపారు.
హ్యుమానిటీస్ గ్రూపుల్లో పాఠాల
తొలగింపుపై నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిపుణుల కమిటీలు కొన్ని
పాఠాల తొలగింపునకు సిఫార్సు చేశాయన్నారు. అయితే.. ఆ సిఫార్సులపై చర్చించి
ఆమోదించాల్సి ఉందన్నారు. సైన్స్ గ్రూపులకు సంబంధించిన పాఠాలు సీబీఎస్ఈ సూచనల
ప్రకారమే తొలగించినట్టు వివరించారు.
0 Komentar