TS: Inter Board's key decision – Good news
to lecturers ..!
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం -
కాలేజీలకు షాక్ - లెక్చరర్లకు ఊరట..!
ప్రయివేటు కాలేజీల తీరుపై తెలంగాణ
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక
నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీలు తమ సిబ్బందిని తొలగిస్తే చర్యలు తప్పవని
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. సిబ్బందిని తొలగించిన కాలేజీలపై
ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిబంధనల మేరకు
సిబ్బంది లేకపోతే కాలేజీల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు
వెల్లడించింది.
జూనియర్ కాలేజీల అకడమిక్
క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్‌బోర్డు నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా
దృష్ట్యా విద్యాసంవత్సరం పనిదినాలను 220 రోజులకు బదులు 182 రోజులుగా పేర్కొంది. ఈ నెల 1వ తేదీ నుంచి
విద్యాసంవత్సరం ప్రారంభమైనట్లుగా తెలిపింది. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 16.
2020-21 ఇంటర్ అకడమిక్
క్యాలెండర్:
మొత్తం పనిదినాలు: 182
తరగతులు ప్రారంభ తేదీ:
సెప్టెంబర్ 1, 2020
కాలేజీలకు చివరి పని రోజు: ఏప్రిల్
16,
2021
ప్రీ ఫైనల్ పరీక్షలు:
ఫిబ్రవరి 22 నుంచి 27, 2021
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: మార్చి 1
నుంచి 20, 2021
ఇంటర్ థియరీ పరీక్షలు: మార్చి 24
నుంచి ఏప్రిల్ 12, 2021
వేసవి సెలవులు: ఏప్రిల్
17 నుంచి మే 31, 2021
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ: మే
చివరి వారం, 2021
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం: జూన్ 1, 2021
0 Komentar