TS: Intermediate Academic Calendar Released
ఇంటర్ అకడమిక్ క్యాలెండర్
విడుదల
దసరాకి 3, సంక్రాతికి 2 రోజులే సెలవులు
జూనియర్ కాలేజీల అకడమిక్
క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు నేడు విడుదల చేసింది.
రాష్ట్ర ఇంటర్మీడియట్ అకడమిక్
క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్
బోర్డు నేడు విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులుగా ఖరారు చేసింది. దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించింది.
వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అకడమిక్ ఇయర్
లాస్ట్ వర్కింగ్ డే గా 2021 ఏప్రిల్ 16ను ఖరారు చేసింది.
ఇక ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో
నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ప్రవేశాల విషయంలో
త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పరీక్ష రాయని వారు కూడా పాస్:
పరీక్ష రాయని ఇంటర్ విద్యార్థులను
కూడా పాస్ చేయాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉన్నట్లు సమాచారం. మార్చిలో వార్షిక
పరీక్షలు రాసేందుకు పరీక్ష ఫీజులు చెల్లించి.. హాజరుకాలేకపోయిన ఇంటర్ సెకండియర్
విద్యార్థులనూ పాస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ఇంటర్ బోర్డు సంబంధిత
ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ
అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
0 Komentar