TSBIE: Junior colleges in shift mode .. Second Year classes in the morning ..!
షిఫ్టు పద్ధతిలో
జూనియర్ కాలేజీలు.. ఉదయం సెకండియర్ క్లాసులు..!
తెలంగాణ రాష్ట్రంలో జూనియర్
కాలేజీలను షిఫ్టు పద్ధతిలో తెరవనున్నారు.
కరోనా కారణంగా మూతబడిన జూనియర్
కాలేజీలను షిఫ్టు పద్ధతిలో తెరవనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు పంపిన ప్రతిపాదనకు
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే షిఫ్టు
పద్ధతిలో కాలేజీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్‌బోర్డు ప్రణాళిక సిద్ధం
చేసింది.
భౌతిక దూరం పాటించాల్సిన దృష్ట్యా
సెకండియర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఫస్టియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు
నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఎంపీసీ, బైపీపీ గ్రూపుల్లో సీబీఎస్‌ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా
తొలగిస్తున్నామని, అందువల్ల జేఈఈ, నీట్‌లకూ
సమస్య ఉండదని పేర్కొన్నారు. దీంతో మొత్తం సిలబస్‌లో 30 శాతం
వరకు తగ్గనుంది.
0 Komentar