TSPSC: Notifications issued
for the replacement of 36,665 jobs in five years
ఐదేళ్లలో 36,665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
జారీ.. టీఎస్‌పీఎస్సీ జాబ్స్ రిపోర్ట్..!
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి
సంబంధించి 2018-19 వార్షిక నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు
అందించింది.
29,128 ఉద్యోగాల భర్తీ
ప్రక్రియ పూర్తి
39,952 పోస్టుల భర్తీకి
ఆర్థికశాఖ ఆమోదం
గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ 2018-19 వార్షిక నివేదిక అందజేత
టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీకి
సంబంధించి 2018-19 వార్షిక నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు
అందించింది. గవర్నర్‌తో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎస్‌పీఎస్సీ
చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదికను అందించారు. 2015 జూలై
నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు టీఎస్‌పీఎస్సీ ద్వారా 39,952
ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపిందని నివేదికలో పేర్కొన్నారు.
ఇప్పటివరకు 36,665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసినట్లు తెలిపారు. వాటిలో 29,128 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. 1621 పోస్టుల
భర్తీ చివరి దశల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కుల వెయిటేజీ, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల 5,916 పోస్టుల
భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలిపారు. ఇందులో 290
పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్
నుంచి 30శాతం వెయిటేజీ మార్కుల జాబితా అందలేదని
పేర్కొన్నారు.
కోర్టు కేసుల వల్ల 4,207 పారామెడికల్ పోస్టులు, 1,419 టీఆర్టీ, గురుకుల పీఈటీ పోస్టుల భర్తీ నిలిచిపోయినట్లు తెలిపారు. 2018-19లో 18 నోటిఫికేషన్ల ద్వారా 3,276 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని, ఇందులో 45 పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. ఈ పరీక్షలకు 19,91,770 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 12,97,566 మంది
హాజరైనట్లు తెలిపారు. వీరిలో 15,994 మంది ఎంపికైనట్లు
పేర్కొన్నారు. గతేడాది 107 కేసులకుగానూ 100 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
0 Komentar