Unlock 5.0 Guidelines Released - Permission for Theatres
అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల – థియేటర్లకు అనుమతి
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో
ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.
సెప్టెంబర్ 30తో
అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని మినహాయింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది. అయితే, 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు
అనుమతిచ్చింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై
నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు
కల్పించింది. ఈ అక్టోబర్ 15 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ఎగ్జిబిషన్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు తెరిచేందుకు కేంద్రం
అనుమతిచ్చింది. అలాగే, క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్
పూల్స్ తెరిచే వెసులుబాటు కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టంచేసింది .
0 Komentar