Video lessons for students from today
నేటి నుంచి విద్యార్థులకు వీడియో
పాఠాలు
విద్యా సంస్థలను ఈ నెల చివరివరకు తెరవొద్దని
కేంద్రం అన్‌లాక్-4.0 మార్గదర్శకాల్లో పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్రంలో వీడియో
తరగతుల నిర్వహణకు సమగ్రశిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి
పదో తేదీ వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో ఒకటి నుంచి
పదో తరగతి వరకు వీడియో పాఠాలు బోధించనున్నారు. వారంలో ఐదు రోజులపాటు (సోమవారం
నుంచి శుక్రవారం వరకు) రోజూ ఆరు గంటలు చొప్పున ఈ పాఠాలు ప్రసారం చేయనున్నారు. 8, 9
తరగతులకు(భాషలు) ఉదయం 10 నుంచి 11గంటల వరకు, ఒకటో తరగతికి
11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో తరగతికి 12గంటల
నుంచి ఒంటిగంట, 3, 4, 5 తరగతులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం మూడు గంటలు, 6,7 తరగతులకు మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు, పదో
తరగతికి సాయంత్రం నాలుగు నుంచి 5గంటల వరకు పాఠాలు ప్రసారం కానున్నాయి.
0 Komentar